త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | లుంగీ ఎంగిడి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది.. అప్‌డేట్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహ‌కులు..

IPL 2026 | ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన పేసర్ లుంగీ ఎంగిడి తీవ్రంగా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. దాంతో వెంట‌నే ఐపీఎల్ నిర్వాహ‌కులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఫీల్డింగ్ సమయంలో జరిగిన ఈ ఘటనతో మైదానంలో నిశ్శ‌బ్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది.

P

Sports | Published On Apr 25, 2026, 10.30 pm IST

IPL 2026 | లుంగీ ఎంగిడి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది.. అప్‌డేట్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహ‌కులు..
Advertisement

IPL 2026 | ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన పేసర్ లుంగీ ఎంగిడి తీవ్రంగా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. దాంతో వెంట‌నే ఐపీఎల్ నిర్వాహ‌కులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఫీల్డింగ్ సమయంలో జరిగిన ఈ ఘటనతో మైదానంలో నిశ్శ‌బ్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. క్యాచ్ అందుకునే క్రమంలో ఎంగిడి బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఈ సమయంలో ఈ స‌మ‌యంలో తలకు బలంగా దెబ్బ తగలడంతో వెంటనే జట్టు వైద్య సిబ్బంది మైదానంలోకి చేరుకుని చికిత్స ప్రారంభించారు.

తలనొప్పి, మెడ నొప్పి ఉందని తెలుప‌డంతో ముందు జాగ్రత్త చర్యగా అంబులెన్స్‌ను స్టేడియంలోకి తీసుకువ‌చ్చి.. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనతో ఆట కొంతసేపు నిలిచిపోయింది. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తర్వాత ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో ఎంగిడి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. త్వరలోనే అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంతో పాటు అభిమానులు ఊరట క‌లిగిన‌ట్ల‌య్యింది. ఇదిలా ఉండగా, గాయపడిన ఎంగిడి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను కంక‌ష‌న్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement