Mbappe | ఓటమి ఎదురైనా తలెత్తుకునే ఉండాలి.. ఎంబాపే కామెంట్స్..!
Mbappe | ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో 0-2 తేడాతో ఫాన్స్ ఓటమిపాలైంది. ఈ ఓటమిపై ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో జట్టు అనుకున్న వ్యూహాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అంగీకరించాడు. సాంకేతికంగా, వ్యూహాత్మకంగా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్పెయిన్ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందని తెలిపాడు.
Mbappe | ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో 0-2 తేడాతో ఫాన్స్ ఓటమిపాలైంది. ఈ ఓటమిపై ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో జట్టు అనుకున్న వ్యూహాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అంగీకరించాడు. సాంకేతికంగా, వ్యూహాత్మకంగా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్పెయిన్ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందని తెలిపాడు. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. 22వ నిమిషంలో మికెల్ ఒయార్జాబల్ పెనాల్టీ ద్వారా తొలి గోల్ చేయగా.. ద్వితీయార్థంలో పెడ్రో పోరో మరో గోల్ సాధించి ఫ్రాన్స్ ఆశలకు తెరదించాడు.
ఓడినా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎంబాపే ఓటమి కూడా ప్రతి జట్టు ప్రయాణంలో భాగమేనని, దాన్నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జట్టు సభ్యులకు సూచించాడు. "విజయం సాధించినప్పుడు ఎలా తలెత్తుకుని నిలబడతామో.. ఓడిపోయినప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో నిలబడాలి. మేం అనుకున్న విధంగా ఆడలేకపోయాం. వ్యూహం, సాంకేతికత, జట్టు ప్రదర్శన.. ఏ విషయంలోనూ ప్రమాణాలకు తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాం. ప్రపంచకప్ సెమీఫైనల్ వంటి మ్యాచ్‌లో ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోతే గెలవడం కష్టం" అని వ్యాఖ్యానించాడు.
స్పెయిన్ నియంత్రించింది
మ్యాచ్ మొత్తం స్పెయిన్ తమ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేసిందని ఎంబాపే ప్రశంసించాడు. ఫ్రాన్స్ మాత్రం మ్యాచ్ గమనాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేకపోయిందని చెప్పాడు. "స్పెయిన్ ఆటను పూర్తిగా నియంత్రించింది. మ్యాచ్ వేగాన్ని నిర్ణయించే అవకాశాన్ని మేం వారికి ఇచ్చాం. బంతిపై ఆధిపత్యం సాధించిన స్పెయిన్ లాంటి జట్టుపై తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. ఆరంభం నుంచే మేం మరింత దూకుడుగా ఆడాల్సింది" అని తెలిపాడు. వ్యక్తిగత పోరులోనూ మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. "బంతిని తిరిగి దక్కించుకున్న తర్వాత పాస్‌లు, టచ్‌లు ప్రపంచకప్ సెమీఫైనల్ స్థాయికి తగినట్లుగా లేవు" అని చెప్పాడు.
ఫ్రాన్స్ అజేయ రికార్డుకు ముగింపు
ఈ ఓటమితో ప్రపంచకప్ నాకౌట్ దశలో ఫ్రాన్స్ కొనసాగించిన అద్భుత విజయయాత్రకు తెరపడింది. 2014 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో జర్మనీ చేతిలో ఓడిన తర్వాత తొలిసారి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ పరాజయం చవిచూసింది. ఆ మధ్యకాలంలో ఫ్రాన్స్ వరుసగా 11 నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా 10 విజయాలు, ఒక డ్రాతో కొనసాగింది. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్‌కు ఇది నాలుగో ఓటమి. మరోవైపు వరుసగా మూడో ప్రధాన టోర్నమెంట్ సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలోనే ఫ్రాన్స్ ఓడింది. ఇప్పటికే యూరో-2024, నేషన్స్ లీగ్-2025 సెమీఫైనల్స్‌లో స్పెయిన్ ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది.
మూడో స్థానం కోసం పోరు
ఫైనల్ చేరి దేశ ప్రజలకు ఆనందాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని, కానీ అది నెరవేరకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఎంబాప్పే తెలిపాడు. "ప్రస్తుతం మా భావాలను మాటల్లో చెప్పలేం. ఈ పరాజయాన్ని జీర్ణించుకుని మళ్లీ నిలబడాల్సిందే. విశ్రాంతి తర్వాత క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎన్నో సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. వాటిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది" అని అన్నాడు. ఇప్పుడు ఫ్రాన్స్ జట్టు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్-అర్జెంటీనా రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో తలపడనుంది.
తాజావార్తలు
- ●Massive Fire | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకుపోయిన 50 కుటుంబాలు
- ●KBR Park | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. ట్రాఫిక్ నివారణే ధ్యేయం..
- ●Motorola Edge 70 Max | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్70 మ్యాక్స్
- ●ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్
- ●TWJF | అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి.. టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
- ●Mahesh Kumar Goud | దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చారు.. బీజేపీ సర్కార్‌పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

Massive Fire | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకుపోయిన 50 కుటుంబాలు

KBR Park | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. ట్రాఫిక్ నివారణే ధ్యేయం..

Motorola Edge 70 Max | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్70 మ్యాక్స్

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్





