IPL Qualification Scenario | ప్లేఆఫ్ రేసులో కోల్‌కతా నైట్‌రైడర్స్..! సన్‌రైజర్స్ పరిస్థితి ఏంటంటే..?
IPL Qualification Scenario | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గాడిలో పడింది. తొలి ఆరు మ్యాచుల్లో ఒక విజయం సాధించలేక తీవ్ర ఒత్తిడిలో పడ్డ ఆ జట్లు వరుసగా నాలుగు విజయాలను సాధించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL Qualification Scenario | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గాడిలో పడింది. తొలి ఆరు మ్యాచుల్లో ఒక విజయం సాధించలేక తీవ్ర ఒత్తిడిలో పడ్డ ఆ జట్లు వరుసగా నాలుగు విజయాలను సాధించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. తొలుత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. ఆ తర్వాత ఫిన్ అలెన్ 47 బంతుల్లో శతకం బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ నాలుగు విజయాలను నమోదు చేసింది. ఒక మ్యాచ్ రద్దవగా.. తొమ్మిది పాయింట్లను ఆ జట్టు ఖాతాలో వేసుకుంది.
టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో సన్‌రైజర్స్
పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 11 మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఏడు విజయాలను నమోదు చేసింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్ల ఉన్నాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఖాతాలో 12 పాయింట్లతో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పది పాయింట్లతో ఆరు, ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో ఎనిమిదో పాయింట్లతో ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చివరి రెండుస్థానాల్లో ఉన్నాయి.
డూ ఆర్ డై..
ఢిల్లీ-కేకేఆర్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోలర్డర్స్‌లో ఎలాంటి మార్పులు జరుగలేదు. హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 494 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. పది మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ వద్దే పర్పుల్ క్యాప్ ఉన్నది. ఇదిలా ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ రేసులో నిలిచినా.. రాబోయే మ్యాచుల్లో తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందే. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే కేకేఆర్ ఖాతాలో మొత్తం 17 పాయింట్లు చేరతాయి. ఆ పరిస్థితిలో ప్లేఆఫ్ అవకాశాలుంటాయి. ఒక్క ఓటమి ఎదురైనా ప్లేఆఫ్ ఆశలు దాదాపుగా ముగిసే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్లేఆఫ్ అవకాశాలు మూసుకుపోయినట్లేగా భావిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






