DC | మళ్లీ కామెంటేటర్‌గా కెవిన్ పీటర్సన్.. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవికి గుడ్‌బై..!
DC | ఈ నెల 28న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానున్నది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మెంటర్ పదవికి రాజీనామా చేశాడు. రోల్ కోసం పని చేయాల్సిన సమయం కేటాయించలేనని, అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కెవిన్ తెలిపాడు.
DC | ఈ నెల 28న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానున్నది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మెంటర్ పదవికి రాజీనామా చేశాడు. రోల్ కోసం పని చేయాల్సిన సమయం కేటాయించలేనని, అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కెవిన్ తెలిపాడు. మళ్లీ ఈ సీజన్ నుంచి కామెంటేటర్‌గా మళ్లీ కనిపించనున్నాడు. పీటర్సన్‌ను డీసీ గతేడాది ఫిబ్రవరిలో మెంటార్‌గా నియమించింది. ఆ సమయంలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావ్, హెడ్ కోచ్ హేమాంగ్ బదాని, అసిస్టెంట్ కోచ్ మ్యాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌లతో కలిసి పని చేశాడు.
సోషల్ మీడియా వేదికగా ఈ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మాట్లాడుతూ తాను ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా పని చేయబోవడం లేదని తెలిపాడు. మెంటార్ పని చేసేందుకు అవసరమైనంత సమయం కేటాయించలేనని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఆడుతున్న ప్లేయర్లందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. కామెంటరీ బాక్స్‌లో మళ్లీ కలుద్దామని.. ఐపీఎల్ ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ అని, త్వరలో అందరినీ కలవాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో పుట్టిన కెవిన్ పీటర్స్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాడు. 104 టెస్ట్ మ్యాచుల్లో 47.28 సగటుతో 8,181 పరుగులు చేశాడు. 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 831 పరుగులు సాధించాడు. 2008–09 మధ్య ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2010 టీ20 వలర్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఐసీసీ ట్రోఫీని గెలువడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో మొత్తం 36 మ్యాచుల్లో 1,001 పరుగులు చేశాడు.
🚨 समाचार 🚨
मैं आईपीएल के इस सीजन में दिल्ली कैपिटल्स के लिए मेंटर नहीं बन सकता।
मैं उस समय के लिए प्रतिबद्ध नहीं हो सकता, जो काम की आवश्यकता है।
सभी खिलाड़ियों को इस सीजन के लिए शुभकामनाएं! ❤️
हालांकि मैं आपको कॉम बॉक्स में वापस देखूंगा! आईपीएल दुनिया की सबसे अच्छी लीग है…
— Kevin Pietersen🦏 (@KP24) March 14, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






