ITA vs SCO | ఇటలీపై స్కాట్లాండ్ గ్రాండ్ విక్టరీ..! తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న మున్సే..!
ITA vs SCO | ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-సీలో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారిగా ఐసీసీ ఈవెంట్‌లో ఆడుతున్న ఆ జట్టు పరాజయం పాలైంది. టాస్ గెలిచిన ఇటలీ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇటలీ 16.4 ఓవర్లలోనే 134 పరుగులకు కుప్పకూలింది.
ITA vs SCO | ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-సీలో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారిగా ఐసీసీ ఈవెంట్‌లో ఆడుతున్న ఆ జట్టు పరాజయం పాలైంది. టాస్ గెలిచిన ఇటలీ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇటలీ 16.4 ఓవర్లలోనే 134 పరుగులకు కుప్పకూలింది.
తొలి బంతికే ఎదురుదెబ్బ..
ఇటలీ ఇన్నింగ్స్ మొదటి బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్ లీస్క్ బౌలింగ్‌లో జస్టిన్ మోస్కా క్యాచ్ అవుట్ అయ్యాడు. జేజే స్మట్స్, ఆంథోనీ మోస్కా రెండో వికెట్‌కు 18 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆంథోనీ 12 బంతుల్లో 13 పరుగులు చేయగా, స్మట్స్ 11 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యారీ మెనెంటి, బెన్ మెనెంటి నాలుగో వికెట్‌కు 45 బంతుల్లో 73 పరుగులు జోడించారు. అయితే, ఈ భాగస్వామ్యం విడిపోయిన వెంటనే ఇటలీ ఇన్నింగ్స్ కుప్పకూలింది. హ్యారీ 25 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. బెన్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. గ్రాంట్ స్టీవర్ట్ 2, కృష్ణన్ 3, థామస్ డ్రాకా 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జియాన్ మీడ్, అలీ హసన్ పరుగులేమీ చేయలేకపోయారు. కెప్టెన్ బెన్ మాడ్సెన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడగా బ్యాటింగ్‌కు రాలేదు. ఇటలీ 134 పరుగులకే ఆలౌట్ అయింది. స్కాట్లాండ్ తరఫున మైఖేల్ లీస్క్ నాలుగు వికెట్లు తీయగా, మార్క్ వాట్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ కర్రీ, బ్రాడ్ వీల్, ఆలివర్ డేవిడ్‌సన్ తలో వికెట్ తీశారు.
స్కాట్లాండ్ శుభారంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌కు శుభారంభం లభించింది. జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్ తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మున్సే తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. 54 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులు చేసి హ్యారీ గ్రాంట్ స్టీవర్ట్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జోన్స్ జేజే స్మట్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 30 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. కెప్టెన్ రిచీ బేరింగ్టన్ 11 బంతుల్లో 15 పరుగులు చేయగా, టామ్ బ్రూస్ ఒక పరుగు మాత్రమే చేశాడు. చివరగా బ్రెండన్ మెక్‌మల్లెన్ నాలుగు సిక్సర్లతో సహా 18 బంతుల్లో 41 పరుగులు సాధించగా.. మైఖేల్ లీస్క్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో సహా కేవలం ఐదు బంతుల్లోనే మెరుపు వేగంతో అజేయంగా 22 పరుగులు చేశాడు. ఇటలీ తరఫున అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, జేజే స్మట్స్ తలో ఒక వికెట్ తీశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






