త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SRH Vs RCB | ఐపీఎల్ షురూ.. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. ఎస్ఆర్‌హెచ్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌

SRH Vs RCB | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 19వ సీజ‌న్‌లో భాగంగా బెంగ‌ళూరు ఎం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

P

Sports | Published On Mar 28, 2026, 7.11 pm IST

SRH Vs RCB | ఐపీఎల్ షురూ.. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. ఎస్ఆర్‌హెచ్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌
Advertisement

SRH Vs RCB | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 19వ సీజ‌న్‌లో భాగంగా బెంగ‌ళూరు ఎం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇషాన్ కిష‌న్ నేతృత్వంలోని హైద‌రాబాద్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ సంద‌ర్భంగా పాటిదార్ మాట్లాడుతూ జ‌ట్టులో బెస్ట్ ప్లేయ‌ర్స్ ఉన్నార‌ని, అంద‌రూ ఫిట్‌గా ఉన్నార‌ని తెలిపాడు. మ్యాచ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. జెర్సీపై రెండో స్టార్ కోసం త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని పేర్కొన్నాడు. ఇషాన్ కిష‌న్ మాట్లాడుతూ వికెట్ కొత్త‌గా క‌నిపిస్తోంద‌ని. తొలుత బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఇబ్బంది లేద‌ని తెలిపాడు. మ్యాచ్‌లో ప్రణాళిక‌ల‌ను అమ‌లు చేయాల్సి ఉంద‌ని.. ఆట‌గాళ్లు అంద‌రూ ఫామ్‌లో ఉన్నార‌ని తెలిపాడు.

మృతుల‌కు ఆర్‌సీబీ నివాళి..

గ‌తేడాది ఆర్‌సీబీ విజ‌యోత్స‌వాల స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతుల‌కు ఆ జ‌ట్టు నివాళుల‌ర్పించింది. మృతుల కోసం ప్ర‌త్యేకంగా 11 సీట్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా మృతుల‌కు సంతాప సూచ‌కంగా ఆట‌గాళ్లు బ్లాక్ రిబ్బ‌న్ ధ‌రించి మ్యాచ్ ఆడ‌నున్నారు.

బెంగ‌ళూరుపై హైద‌రాబాద్‌దే ఆధిప‌త్యం..

ఐపీఎల్ ఇరు జ‌ట్లు ఐపీఎల్ ఇప్ప‌టి వ‌ర‌కు 26 మ్యాచులు ఆడాయి. ఇందులో రెండు మ్యాచుల‌లో ఫ‌లితం తేల‌లేదు. అయితే, 13 మ్యాచుల్లో సన్‌రైజ‌ర్స్ గెలిచి ఆధిక్యంలో నిలిచింది. ఆర్‌సీబీ 11 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. సాధారణంగా హైద‌రాబాద్ జ‌ట్టుకే స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ.. చారిత్రాత్మ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 8 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది. 2024లో ఆర్‌సీబీపై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు (287) చేసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు క‌లిసి 500పైగా ప‌రుగులు చేయ‌డం విశేషం. ఒక మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ చేతిలో ఆర్‌సీబీ కేవ‌లం 68 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది.

బెంగ‌ళూరు జ‌ట్టు : విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.
ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, రసిఖ్ సలాం దార్, కనిష్క్ చౌహాన్, వెంకటేశ్‌. అయ్యర్
హైద‌రాబాద్ జ‌ట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్‌-వికెట్ కీప‌ర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ.
ఇంపాక్ట్ సబ్స్ : శివంగ్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ పేన్, స్మరన్ రవిచంద్రన్, స‌కిబ్ హుస్సేన్

Advertisement

తాజావార్తలు

Advertisement