Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
Abhishek Porel | బెంగాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆటగాడు అభిషేక్ పోరెల్ (Abhishek Porel) వివావాదంలో చిక్కుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మెడికల్ విద్యార్థినితో సహజీవనం చేస్తున్న పోరెల్.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
Abhishek Porel | త్రినేత్ర.న్యూస్: బెంగాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆటగాడు అభిషేక్ పోరెల్ (Abhishek Porel) వివావాదంలో చిక్కుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మెడికల్ విద్యార్థినితో సహజీవనం చేస్తున్న పోరెల్.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై దాడిచేసి బెదింపులకు పాల్పడుతున్నాడంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కర్ణాటకలోని హుగ్లీ జిల్లా చందనానగర్కు చెందిన పోరెల్ (23) బెంగాల్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియా ఏ టీమ్ తరఫున యూకే, ఆస్ట్రేలియా పర్యటించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2026 ఐపీఎల్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేశాడు. సీజన్లో 4 మ్యాచుల్లో మాత్రమే ఆడాడు.
మూడేండ్లుగా రిలేషన్లో..
కాగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతితో గత మూడేండ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నాడు. పెండ్లి చేసుకుంటానని అబద్ధపు ప్రామిస్ చేసి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనపై దాడి చేసి క్రిమినల్ బెదిరింపులకు గురిచేశాడని హుగ్లీ జిల్లాలోని మొగ్రా పోలీస్ స్టేషన్లో తన తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. గతేడాది నుంచి తమ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, ఆ తర్వాత తనను దూరం పెట్టడం ప్రారంభించాడని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు పెండ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదని పేర్కొంది. అంతేకాకుండా అడిగితే తనపై దాడిచేసి, చంపేస్తానంటూ క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పింది. గతంలోనే ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరినప్పటికీ, అప్పుడు ఆమె ఫిర్యాదు చేయలేదని, కానీ ఇప్పుడు తన తల్లితో వచ్చి ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.
బాగా ఆడుతున్నందుకే..
ఈ ఆరోపణలను అభిషేక్ పోరెల్ కొట్టిపారేశాడు. అవన్నీ అబద్ధాలని చెప్పాడు. ప్రస్తుతం తాను క్రికెట్లో బాగా రాణిస్తున్నందుకే తనపై ఇలాంటి రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయన్నాడు. పోలీసులు ఇప్పటివరకు తనను సంప్రదించలేదని తెలిపాడు.
సంబంధిత వార్తలు

Rega Kanta Rao | పెండ్లి పేరుతో లైంగికంగా వేధించాడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు
జులై 31, 2026

Ajinkya Rahane | అజింక్యా రహానే రిటైర్మెంట్.. క్రికెట్‌కు వీడ్కోలు..
జులై 30, 2026

Tollywood | ఏడడుగులు వేశారు…హిట్టు కొట్టారు – పెళ్లి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోహీరోయిన్లు వీళ్లే!
జులై 13, 2026
తాజావార్తలు
- ●TGCSB raids Delhi | ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్లపై మెరుపుదాడులు.. 21 మంది తెలుగు టెలీకాలర్లు అరెస్ట్
- ●PM Ekta Mall Scam | రాయదుర్గం ఏక్తా మాల్ టెండర్లలో భారీ కుంభకోణం: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సంచలన లేఖ
- ●KCR Nallabelli Visit | కేసీఆర్ పరామర్శ యాత్రపై విషపు రాతలు: 'ఆంధ్రజ్యోతి'ని తగలబెట్టి బీఆర్ఎస్వీ నేత వార్నింగ్
- ●Indiramma Indlu Towers | గుడ్ న్యూస్: 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' అప్లికేషన్ గడువు పెంపు
- ●Singireddy Niranjan Reddy | ఆంధ్రజ్యోతిది ఆది నుంచీ 'చావు భాషే'
- ●RTI on Telangana Housing | ఆర్టీఐతో బయటపడ్డ పక్కా లెక్కలు: తెలంగాణలో డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ ఇదే!

TGCSB raids Delhi | ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్లపై మెరుపుదాడులు.. 21 మంది తెలుగు టెలీకాలర్లు అరెస్ట్

PM Ekta Mall Scam | రాయదుర్గం ఏక్తా మాల్ టెండర్లలో భారీ కుంభకోణం: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సంచలన లేఖ

KCR Nallabelli Visit | కేసీఆర్ పరామర్శ యాత్రపై విషపు రాతలు: 'ఆంధ్రజ్యోతి'ని తగలబెట్టి బీఆర్ఎస్వీ నేత వార్నింగ్

Indiramma Indlu Towers | గుడ్ న్యూస్: 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' అప్లికేషన్ గడువు పెంపు



