త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | బుమ్రాకు ఏమైంది..? ఈ సీజ‌న్‌లో ఒక్క వికెట్ తీయ‌ని మిస్ట‌రీ బౌల‌ర్‌.. మాజీల సూచన‌లు ఇవే..!

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్ ఏ ప్లేయ‌ర్‌కైనా చెత్త సీజన్‌గా మారిందంటే అది ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకే. ఐపీఎల్‌లో ముంబ‌యి ఇండియ‌న్ త‌ర‌ఫున ఆడుతున్న బుమ్రా.. ఆడిన ఐదు మ్యాచుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వికెట్లు ప‌డ‌గొట్ట‌లేక‌పోయాడు.

P

Sports | Published On Apr 17, 2026, 12.54 pm IST

IPL 2026 | బుమ్రాకు ఏమైంది..? ఈ సీజ‌న్‌లో ఒక్క వికెట్ తీయ‌ని మిస్ట‌రీ బౌల‌ర్‌.. మాజీల సూచన‌లు ఇవే..!
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్ ఏ ప్లేయ‌ర్‌కైనా చెత్త సీజన్‌గా మారిందంటే అది ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకే. ఐపీఎల్‌లో ముంబ‌యి ఇండియ‌న్ త‌ర‌ఫున ఆడుతున్న బుమ్రా.. ఆడిన ఐదు మ్యాచుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వికెట్లు ప‌డ‌గొట్ట‌లేక‌పోయాడు. అలాగే, ప‌రుగులు క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నాడు. ఈ సీజన్‌లో ముంబ‌యి వైఫల్యానికి బుమ్రా ఫామ్ కోల్పోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముంబ‌యికి బౌలింగ్ విభాగంలో బుమ్రానే కీల‌క ఆయుధం. ఓపెనింగ్ ఓవర్లలో అయినా, డెత్ ఓవర్లలో అయినా అత‌ని బౌలింగ్‌లో పరుగులు చేయడం బ్యాట్స్‌మెన్‌కు క‌ష్టమే. బ్యాట్స్‌మెన్ అత‌ని బౌలింగ్‌లో రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతూ.. వికెట్లను కాపాడుకోవడానికి ప్ర‌య‌త్నిస్తుంటారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు ఇదే పరిస్థితి. కానీ, ఈ సారి ఐపీఎల్‌లో మాత్రం బుమ్రా ప‌రిస్థితి భిన్నంగా క‌నిపిస్తోంది. యార్కర్ కింగ్ పేరుపొందిన బుమ్రా.. భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటున్నాడు. ముఖ్యంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్ 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ బుమ్రాను ఎదుర్కొన్న తొలిబంతికే సిక్స‌ర్ కొట్ట‌డం విశేషం. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా, 164 పరుగులు ఇచ్చి.. వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బుమ్రా ఫామ్ ముంబ‌యికి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రాకు కీల‌క సూచ‌న‌లు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో బుమ్రా బౌలింగ్‌ను విశ్లేషించాడు. బుమ్రా వికెట్లు తీయడం చాలా కీల‌క‌మ‌ని, ఫామ్ సమస్య కాద‌ని తెలిపాడు. ఈ సీజన్‌లో సగటు వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంద‌ని, దాదాపు 44 శాతం సార్లు స్లో బాల్స్ వేశాడ‌ని పేర్కొన్నారు.

వేసే ప్రతీ రెండో బంతి స్లోగానే ఉంద‌ని.. స్లో బాల్స్ కంటే ఫాస్ట్ బాల్స్ ఎక్కువగా వేస్తే ఫ‌లితాలు బాగా వ‌స్తాయ‌ని తాను భావిస్తున్నాన‌ని చెప్పాడు. బుమ్రా సమస్యకు ఇదే ఓ సులభమైన పరిష్కారం కావొచ్చ‌ని, లేకపోతే బుమ్రాకు కోచింగ్ అవసరం లేద‌ని ఇర్ఫాన్ స్ప‌ష్టం చేశారు. అలాగే, టీమిండియా మాజీ ఆట‌గాడు ఆకాశ్ చోప్రా సైతం కీల‌క సూచ‌న‌లు చేశాడు. తాను బుమ్రాను త‌ప్పుప‌ట్ట‌డం లేద‌ని, ఇప్పటికీ మరీ ఎక్కువ పరుగులు ఏమీ ఇవ్వడం లేద‌ని తెలిపాడు. ఎకానమీ రేటు ఇంకా 10 కంటే తక్కువగానే ఉంద‌ని, అసలు సమస్య బుమ్రాకు ముందు, ఆ తర్వాత బౌలింగ్ చేసేవారి వ‌ద్దే ఉంద‌న్నారు. ఆయా బౌల‌ర్లు మరీ ఎక్కువగా పరుగులు ఇస్తుండ‌డం ఎవరూ బుమ్రాపై రిస్క్ చేయడానికి సాహసించడం లేద‌న్నారు. అందుకే అతనికి వికెట్లు దక్కడం లేద‌న్నారు. టీ20 క్రికెట్‌లో ఒక మంచి బంతికి వికెట్ తీయడం చాలా క‌ష్ట‌మ‌ని, బ్యాట్స్‌మెన్ ఏదైనా షాట్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే వికెట్లు వ‌స్తాయ‌ని ఆకాశ్ చోప్రా గుర్తు చేశాడు.

Advertisement
Advertisement