IPL 2026 | ఆకాశ్ దీప్ స్థానంలో.. కేకేఆర్ జట్టులోకి ఎస్ఆర్‌హెచ్ మాజీ బౌలర్..!
IPL 2026 | త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ వైదొలిగాడు. దాంతో అతని స్థానంలో కేకేఆర్ జట్టు సౌరభ్ దూబేను తుదిజట్టులోకి తీసుకుంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
IPL 2026 | త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ వైదొలిగాడు. దాంతో అతని స్థానంలో కేకేఆర్ జట్టు సౌరభ్ దూబేను తుదిజట్టులోకి తీసుకుంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2022 సీజన్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సౌరభ్ దూబేను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దక్కలేదు. తాజాగా సీజన్ కోసం రూ.30లక్షల బ్రేస్ ప్రైస్‌తో గతేడాది జరిగిన వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ, ఏ జట్టు సైతం అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.
ఓ నివేదిక ప్రకారం.. సౌరభ్ ఇప్పటికే కేకేఆర్ జట్టుతో కలిసి, శిక్షణ శిబిరంలో చేరాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ దేశవాళీ క్రికెట్‌లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది 'లిస్ట్ ఏ' మ్యాచులు ఆడి.. 16 వికెట్లు తీశాడు. మూడు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 'లిస్ట్ ఏ' అరంగేట్ర మ్యాచ్‌లో నేపాల్‌పై అద్భుతంగా రాణించిన సౌరభ్, కేవలం 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఆ టోర్నమెంట్‌లో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో కేకేఆర్ పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ టోర్నీ నుంచి వైదొలిగారు. మతీషా పతిరణ సైతం ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఆటగాళ్లకు తగిలిన గాయాలు కేకేఆర్‌కి ఇబ్బందికరంగా మారాయి. అజింక్యా రహానే కెప్టెన్సీలో ఐపీఎల్ 2025 సీజన్‌లో కేకేఆర్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు 14 మ్యాచుల్లో కేవలం ఐదింటిలో మాత్రమే గెలిచి, ఏడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. అయితే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, కామెరాన్ గ్రీన్ తదితర ఆటగాళ్లు జట్టులో చేరడంతో కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించాడు. సీఫెర్ట్ ఈ మధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆండ్రీ రస్సెల్ జట్టు నుంచి వైదొలిగిన తర్వాత కేకేఆర్ మరో కరేబియన్ 'ఫినిషర్' అయిన రోవ్‌మన్ పావెల్‌ను జట్టులోకి తీసుకుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






