త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | బెంగ‌ళూరుకు కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ స‌న్నాహ‌కాలు షురూ..!

Virat Kohli | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 28న టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు రెండునెల‌ల పాటు జ‌రుగ‌నున్న పొట్టి క‌ప్ సంగ్రామం కోసం ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ బెంగ‌ళూరుకు బుధ‌వారం చేరుకున్నాడు. విరాట్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్‌, ప్లేయ‌ర్ల‌తో పాటు అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు.

P

Sports | Published On Mar 18, 2026, 4.29 pm IST

Virat Kohli | బెంగ‌ళూరుకు కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ స‌న్నాహ‌కాలు షురూ..!
Advertisement

Virat Kohli | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 28న టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు రెండునెల‌ల పాటు జ‌రుగ‌నున్న పొట్టి క‌ప్ సంగ్రామం కోసం ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ బెంగ‌ళూరుకు బుధ‌వారం చేరుకున్నాడు. విరాట్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్‌, ప్లేయ‌ర్ల‌తో పాటు అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు.

విరాట్ బెంగళూరుకు రాకముందు కోహ్లీ లండన్‌లో ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోగా.. ఆ ఫొటోను ఆర్‌సీబీ త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కోహ్లీ చేరికతో జట్టులో ప్రాక్టీస్ సెష‌న్ మ‌రింత ఉత్సాహం నెల‌కొన‌నున్న‌ది. గత సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ సారి కూడా టైటిల్‌ను నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. గ‌తేడాది ఫైన‌ల్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజ‌యం సాధించి తొలిసారిగా టైటిల్‌ను గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 15 మ్యాచుల్లో 657 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచ‌రీలున్నాయి.

ఐపీఎల్ 2026లో టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే కోహ్లీ ప్రదర్శన చాలా కీలకం కానుంది. టాప్ ఆర్డర్‌లో మరోసారి స్థిరమైన, మంచి ఇన్నింగ్స్‌ను విరాట్‌ను జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. తొలి సీజన్ నుంచి ఆర్‌సీబీతో అనుబంధం ఉన్న కోహ్లీ, ప్రతి ఏడాది జట్టులో టాప్ స్కోరర్‌గా నిలుస్తూ వ‌స్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అత్యధిక పరుగులతో పాటు శతకాలు సాధించిన ప్లేయ‌ర్‌గి రికార్డు ఉంది. ఇప్పటివరకు 267 మ్యాచ్‌లలో 8,661 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచ‌రీలు, 63 అర్ధశతకాలు న‌మోదు చేశాడు.

2013 నుంచి 2021 వరకు కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆయన నాయకత్వంలో 2016లో ఫైనల్‌కు చేరుకున్నా టైటిల్‌ను మాత్రం గెలువ‌లేక‌పోయింది. గత సీజన్‌లో ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలో తొలిసారిగా టైటిల్‌ను సాధించింది. ఈ సారి కూడా పటిదార్ కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై అభిమానులు మ‌రోసారి న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఐపీఎల్ ఈ సారి ఈ నెల 28న ప్రారంభంకానుండ‌గా.. తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ఆర్‌సీబీ బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచ‌నాలున్నాయి.

https://x.com/RCBTweets/status/2034110257010798827

Advertisement

తాజావార్తలు

Advertisement