IPL 2026 | బ్రైడన్ కార్సీ అవుట్.. మధుషంక ఇన్.. హైదరాబాద్ జట్టులోకి శ్రీలంక బౌలర్..!
IPL 2026 | శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుషంకను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. గాయపడ్డ ఇంగ్లండ్ ప్లేయర్ బ్రైడన్ కార్సీ స్థానంలో జట్టులో చోటు కల్పించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో కార్స్ చేతికి గాయం కావడంతో టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.
IPL 2026 | శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుషంకను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. గాయపడ్డ ఇంగ్లండ్ ప్లేయర్ బ్రైడన్ కార్సీ స్థానంలో జట్టులో చోటు కల్పించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో కార్స్ చేతికి గాయం కావడంతో టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. టోర్నీ నుంచి తప్పుకునేందుకు ఐపీఎల్ పాలకమండలి ఆమోదించగా.. మధుషంకను ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో మధుషంకను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. ఎడమచేతి మీడియం పేసర్ అయిన మధుషంక శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 70 వికెట్లు తీశాడు. గతంలో ముంబయి ఇండియన్స్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో శుభవార్త అందింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఏప్రిల్ 17న భారత్‌కు రానున్నట్టు సమాచారం. ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ పరీక్ష పూర్తి చేసిన తర్వాత ఐపీఎల్ 2026లో ఆడేందుకు జట్టుతో కలువవనున్నాడు. బుధవారం ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి చేస్తాడని, అందులో ఉత్తీర్ణుడైతే తిరిగి జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Ganesh Chaturthi 2026: గణపతికి 21 రకాల ఆకులే ఎందుకు సమర్పిస్తారు? ఒక్కో పత్రం వెనుక ఆసక్తికరమైన అర్థం!
సెప్టెంబర్ 14, 2026

Asia Cup | ఈ కప్పూ అందుకోలే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాకరించిన భారత్
సెప్టెంబర్ 14, 2026

Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Kargil War Veteran Attacked Gurugram | గురుగ్రామ్‌లో దారుణం: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో పార్కింగ్ సిబ్బంది దాడి
- ●Ganesh Chaturthi 2026: గణపతికి 21 రకాల ఆకులే ఎందుకు సమర్పిస్తారు? ఒక్కో పత్రం వెనుక ఆసక్తికరమైన అర్థం!
- ●Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి
- ●Asia Cup | ఈ కప్పూ అందుకోలే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాకరించిన భారత్
- ●Horoscope | సెప్టెంబర్ 14 రాశిఫలాలు.. ఈ రాశివారికి సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Kargil War Veteran Attacked Gurugram | గురుగ్రామ్‌లో దారుణం: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో పార్కింగ్ సిబ్బంది దాడి

Ganesh Chaturthi 2026: గణపతికి 21 రకాల ఆకులే ఎందుకు సమర్పిస్తారు? ఒక్కో పత్రం వెనుక ఆసక్తికరమైన అర్థం!

Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి

Asia Cup | ఈ కప్పూ అందుకోలే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాకరించిన భారత్



