IPL 2026 | ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. 28న బెంగళూరులో ఆర్‌సీబీని ఢీకొట్టనున్న సన్‌రైజర్స్..!
IPL 2026 | టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. త్వరలో మూడు రాష్ట్రాల అస్లెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే మ్యాచుల సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించింది.
IPL 2026 | టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. త్వరలో మూడు రాష్ట్రాల అస్లెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే మ్యాచుల సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్ 19వ ఎడిషన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్లు రాయల్ చాలెంజర్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. బెంగళూరు, ముంబయి, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ సహా మొత్తం పది వేదికల్లో 20 మ్యాచులు జరుగుతాయి.
ఈ సమయంలో టోర్నీలో నాలుగు డబుల్ హెడర్ (ఒకేరోజు రెండు మ్యాచులు) జరుగుతాయి. డబుల్ హెడర్‌లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచులు భారత కాలమానం ప్రకారం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ 7.30 గంటలకు జరుగుతుంది. ప్రారంభ మ్యాచ్ తర్వాత ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఈ సీజన్‌లోని మొదటి డబుల్ హెడర్ ఏప్రిల్ 4న జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-ముంబయి ఇండియన్స్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ హోంగ్రౌండ్ మ్యాచ్‌లను గౌహతిలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) ప్రారంభ హోం మ్యాచులను న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో ఆడుతుంది.
ఈ సీజన్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోనూ, రెండు మ్యాచ్‌లను రాయపూర్‌లో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ నాలుగు హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌లోనూ, మూడు మ్యాచులను ధర్మశాలలోనూ ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ మూడు హోమ్ మ్యాచ్‌లను గౌహతిలోనూ, నాలుగు మ్యాచ్‌లను జైపూర్‌లోనూ ఆడుతుందని బీసీసీఐ వివరించింది. అయితే, బెంగళూరు జరగాల్సిన మ్యాచులకు కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి అనుమతి తప్పనిసరని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియం సంసిద్ధతను అంచనా వేసేందుకు మార్చి 13న ఎం చిన్నస్వామి స్టేడియంలో సమావేశంతో పాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



