IPL 2026 | టీ20 ప్రపంచకప్ ముగిసింది.. త్వరలో మొదలవనున్న ఐపీఎల్
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసింది. ఈ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగనుంది.
- ఎన్నికల నేపథ్యంలో రెండో దశల్లో షెడ్యూల్
- త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్న బీసీసీఐ
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసింది. ఈ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగనుంది. టోర్నీ మరో 20 రోజుల్లోనే ప్రారంభం కానుంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విధానాన్ని 2024లోనూ అనుసరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో టోర్నీ షెడ్యూల్‌ను దశలవారీగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, తమిళనాడులోని చెన్నై నగరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్ల హోమ్ గ్రౌండ్లుగా ఉన్నాయి. అలాగే అసోంలోని గువాహటి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రెండో హోం గ్రౌండ్‌గా ఉంది.
ప్రస్తుతం ప్రకటించనున్న తొలి దశ షెడ్యూల్ టోర్నీ ప్రారంభంలోని సుమారు తొలి 15 రోజులు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచుల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. 2024లో కూడా సాధారణ ఎన్నికల కారణంగా బీసీసీఐ మొదట రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. పోలింగ్ తేదీలపై స్పష్టత వచ్చిన తర్వాత మిగతా మ్యాచ్‌లను ఖరారు చేసింది. ఈసారి షెడ్యూల్ విడుదల ఆలస్యానికి మరో కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్ల హోమ్ వేదికలపై అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్సీబీ తమ ఐదు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మిగతా రెండు మ్యాచులను రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆడుతుంది. అలాగే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్, ఫైనల్ కూడా బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






