IPL 2026 | కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కష్టాలు.. టోర్నీ నుంచి ఆకాశ్ దీప్ రూల్డ్ అవుట్..!
IPL 2026 | ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ సైతం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ సైతం గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
IPL 2026 | ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ సైతం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ సైతం గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, కేకేఆర్‌కు ప్లేయర్ల గాయాలు ఇబ్బందికరంగా మారాయి. హర్షిత్, ఆకాశ్ దీప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానాకు ఇంక శ్రీలంక బోర్డు ఎన్‌వోసీ జారీ చేయలేదు. ఈ సీజన్‌లో పలు మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ముంబయి ఇండియన్‌తో మార్చి 29న తలపడుతుంది. అయితే, ఆటగాళ్ల గాయాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. హర్షిత్ రాణా, ఆకాశ్‌తో సహా ఐదుగురు ఆటగాళ్లు మొత్తం సీజన్‌కు దూరమయ్యారు. హైదరాబాద్, కోల్‌కతా జట్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం కేకేఆర్‌లో ఫాస్ట్ బౌలర్లుగా వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి మాత్రమే ఉన్నారు. అయితే, ఆల్ రౌండర్ కామెరున్ గ్రీన్ సైతం అందుబాటులో ఉండనున్నాడు. ఆకాశ్ దీప్ 2022లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్‌లో ఆకాశ్ దీప్ 10 వికెట్లు తీశాడు. గత సీజన్ వేలంలో రూ.8 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్ తర్వాత ఆ జట్టు అతన్ని విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కేకేఆర్ బేస్ ప్రైజ్ రూ.కోటికి కొనుగోలు చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






