IPL 2026 | ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆర్‌సీబీకి కష్టాలు.. గాయంతో హేజిల్‌వుడ్ దూరమయ్యే ఛాన్స్..!
IPL 2026 | ఆస్ట్రేలియా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గత కొంతకాలంగా గాయాల కారణంగా క్రికెట్ ఆడలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓ నివేదిక ప్రకారం హేజిల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్, అఖిలీస్ టెండన్ గాయాలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యులు, ఫిజియో అనుమతి ఇస్తేనే ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం ఉంది. హేజిల్‌వుడ్ ఆర్‌సీబీ తరఫున ఆడుతున్నాడు. గత సీజన్‌లో కీలకంగా వ్యవహరించాడు. 12 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి ఆర్‌సీబీ టైటిల్‌ను సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి హేజిల్‌వుడ్ నవంబర్‌లో న్యూ సౌత్ వెయిల్స్ తరఫున ఆడుతూ రైట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం బారినపడ్డాడు.
ఆ తర్వాత ఆసిస్ ఆడిన సిరీస్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్‌కి దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ ఐపీఎల్ సమయానికి కోలుకోవాలని ఫ్రాంచైజీ కోరుకుంటోంది. ఇప్పటి వరకు 39 మ్యాచుల్లో 57 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో కొన్ని మ్యాచులకు దూరమైనా.. నాకౌట్ దశలో జట్టులో చేరి జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. గత సీజన్‌లో ఎకానమీ రేట్ 8.77గా ఉంది. ఆర్‌సీబీ అభిమానులతో పాటు యాజమాన్యానికి టెన్షన్ పట్టుకుంది. హేజిల్‌వుడ్ సమయానికి కోలుకోకపోతే జట్టు బౌలింగ్ కాస్త బలహీనమయ్యే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ను ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. బీసీసీసీ ఇటీవల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు విడుదల్లో రిలీజ్ చేయనుంది. 20 మ్యాచుల కోసం ఇటీవల షెడ్యూల్‌ని ప్రకటించింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






