IPL 2026 | జాక్ ఎడ్వర్డ్స్ అవుట్.. డేవిడ్ పేన్ ఇన్..! ఎస్ఆర్‌హెచ్‌లోకి టీ20 స్టార్ బౌలర్..!
IPL 2026 | ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దాంతో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ అలాన్ పైన్ జట్టులోకి తీసుకుంది.
IPL 2026 | ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దాంతో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ పేన్ జట్టులోకి తీసుకుంది.
సన్‌రైజర్స్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దాంతో ప్రారంభ మ్యాచులకు దూరం కానున్నాడు. దాంతో అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. అలాగే, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కాలి గాయంతో మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఎస్ఆర్‌హెచ్ రూ.3కోట్లకు కొనుగోలు చేసింది. అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్ భారీ నమ్మకం పెట్టుకోగా గాయం నుంచి టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ కావాల్సి వచ్చింది
బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సౌరబ్ దూబే, డేవిడ్ పేన్ రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేశాయని తెలిపింది. పైన్ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో ఎస్ఆర్‌హెచ్‌లో చేరనున్నాడు. ఈ బౌలర్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు టీ20 లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు 233 మ్యాచులు ఆడగా.. ఇంగ్లండ్ తరఫున ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ బౌలర్‌ను రూ.1.5 కోట్లకు తీసుకుంది.
డేవిడ్ పేన్ టీ20 కెరీర్‌లో 233 మ్యాచ్‌ల్లో 21.16 సగటుతో 304 వికెట్లు పడగొట్టాడు. 5/24 బెస్ట్ బౌలింగ్ గణాంకాలు. ఇటీవల జరిగిన ఐఎల్టీ20 2025-26 సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. బిగ్ బ్యాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కాలర్ తరఫున ఆరు మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 300పైగా వికెట్లు తీసిన ఆ బౌలర్‌పై ఎస్ఆర్‌హెచ్ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్ ఈ నెల 28న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీతో బెంగళూరు చిన్నస్వామి వేదికగా ఆడనుంది.
https://x.com/SunRisers/status/2036341473055219863
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






