IPL 2026 | త్వరలో ఐపీఎల్.. మార్గదర్శకాలు జారీ చేసిన బీసీసీఐ..!
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ నెల 28న మొదలుకానున్నది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఐపీఎల్ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు త్వరలో ప్రారంభం కానున్న సీజన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ నెల 28న మొదలుకానున్నది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఐపీఎల్ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు త్వరలో ప్రారంభం కానున్న సీజన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాక్టీస్ సెషన్లలో ఒక జట్టు ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌ను మరొక జట్టు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఒక జట్టు తర్వాత మరో జట్టు ప్రాక్టీస్ చేస్తే, కొత్త పిచ్ అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ప్రతి జట్టుకు వారి కేటాయించిన ప్రాక్టీస్ సెషన్‌కు కొత్త నెట్స్ ఇవ్వాలని, ఒకేసారి రెండు జట్లు ప్రాక్టీస్ చేస్తే, ఒక జట్టు తర్వాత మరో జట్టు ప్రాక్టీస్ చేస్తే మొదటి జట్టు నెట్‌లను (థ్రో-డౌన్స్ సహా) ఉపయోగించకూడదని, ఒక జట్టు ప్రాక్టీస్ ముగించినా కూడా రెండో జట్టు వారి రేంజ్ హిటింగ్ వికెట్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
అలాగే, లైట్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే జట్టు కావాలంటే.. మ్యాచ్ గరిష్టంగా 3.30 గంటల్లోనే ముగించాలని మార్గదర్శకాల్లో చెప్పింది. ఈ సారి ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రతిజట్టు రెండు మాత్రమే ప్రాక్టీస్ మ్యాచులు ఆడతాయి. ఆ మ్యాచులు ఆడే ముందు బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మ్యాచులు ఐపీఎల్‌లో ఉపయోగించిన ప్రధాన పిచ్‌లపై ఆడకూడదని స్పష్టం చేసింది. సీజన్‌కు పిచ్‌ను సిద్ధం చేసుకోవడానికి, ప్రాసెస్‌లో సంబంధిత ఫ్రాంచైజీ తొలి హోమ్ మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందుగానే మెయిన్ స్క్వేర్‌లో ప్రాక్టీస్ సెషన్స్, ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ సమయంలో, హోమ్ ఫ్రాంచైజీ కోరినట్లయితే స్టేట్ అసోసియేషన్ ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను ఉచితంగా అందించాలని బీసీసీఐ చెప్పింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






