త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | జ‌వాన్ల నివాస భ‌వ‌నాల‌ను ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది

Bandi Sanjay | త్రినేత్ర న్యూస్: దేశానికి ర‌క్ష‌ణ గోడ‌లా నిలుస్తున్న వీర జ‌వాన్ల కోసం చెన్నైలోని BSF హెడ్ క్వార్టర్స్ లో నూత‌న నివాస భ‌వ‌నాల‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంద‌ని కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి బండి సంజ‌య్ అన్నారు.

S

National | Published On Sep 25, 2026, 6.44 pm IST

Bandi Sanjay | జ‌వాన్ల నివాస భ‌వ‌నాల‌ను ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది
Advertisement
  • దేశ రక్షణలో బీఎస్ఎఫ్‌దే అగ్రభాగం
  • జవాన్లకు మౌలిక సౌకర్యాల‌ కల్పనే మోదీ ప్రభుత్వ ల‌క్ష్యం
  • చెన్నై బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో నూతన భవనాల‌ ప్రారంభోత్స‌వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

Bandi Sanjay | త్రినేత్ర న్యూస్: దేశానికి ర‌క్ష‌ణ గోడ‌లా నిలుస్తున్న వీర జ‌వాన్ల కోసం చెన్నైలోని BSF హెడ్ క్వార్టర్స్ లో నూత‌న నివాస భ‌వ‌నాల‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంద‌ని కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి బండి సంజ‌య్ అన్నారు. 2014లో బీఎస్ఎఫ్ చెన్నై-మల్కాన్‌గిరి సెక్టర్ ఏర్పడినప్పటి నుంచి నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా మన రక్షణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా పనిచేస్తోందన్నారు. ఈరోజు మల్కాన్‌గిరి ప్రాంతం శాంతి, అభివృద్ధి దిశ‌గా ముందుకు సాగుతోంద‌న్నారు. శుక్ర‌వారం భ‌వ‌నాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌వాన్ల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. దేశ రక్షణలో సరిహద్దు భద్రతా దళం అగ్రభాగాన నిలుస్తోందన్నారు.

నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తుల పీచమణచడంలో బీఎస్ఎఫ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బీఎస్ఎఫ్ సిబ్బంది రక్షణ కవచంలా నిలవడంవల్లే మల్కాన్‌గిరి ప్రాంతం శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందనక్నారు. బీఎస్ఎఫ్ చెన్నై-మల్కాన్‌గిరి సెక్టర్ సిబ్బంది చూపిస్తున్న ధైర్యం, అప్రమత్తత, అంకితభావం BSF నినాదమైన “జీవితాంతం కర్తవ్యం” అనే మాటలకు నిజమైన అర్థాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు మల్కాన్‌గిరి శాంతి, అభివృద్ధికి కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. మౌలిక సదుపాయాల రంగంలో కూడా అక్కడ నిరంతర అభివృద్ధి జరుగుతోంది. ఇది మీలాంటి వీర జవాన్లు ఒక అభేద్యమైన రక్షణ గోడలా నిలబడి దేశాన్ని కాపాడటం వల్లే సాధ్యమైంది.

దేశానికి రక్షణ కల్పించడంలో బీఎస్ఎఫ్ అగ్రభాగాన నిలిచింది. దేశ సరిహద్దులను రాత్రింబవళ్లు కాపాడేందుకు BSF సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేశాన్ని కాపాడే మన జవాన్లు కూడా సురక్షితంగా ఉండేందుకు వారికి అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పం. ఈరోజు ప్రారంభించిన ఈ ఆధునిక బ్యారక్ కేవలం ఒక భవనమే కాదు. ప్రతికూల పరిస్థితుల్లో, మైనస్ ఉష్ణోగ్రతల్లో, ఎన్నో సవాళ్ల మధ్య కూడా దేశ సరిహద్దులను కాపాడుతున్న వీర సిబ్బంది, జవాన్ల పట్ల మన గౌరవానికి ఇది ఒక ప్రతీక. ఈ కొత్త ప్రాంగణంలో జవాన్లకు విశ్రాంతి, పరిశుభ్రత, రోజువారీ అవసరాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాం. డ్యూటీ పూర్తయిన తర్వాత మన జవాన్లకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకుని మళ్లీ ఉత్సాహంగా, అంకితభావంతో, ఉన్నతమైన మనోధైర్యంతో విధులు నిర్వహించేలా మంచి వాతావరణాన్ని కల్పించడం మన లక్ష్యం.

దక్షిణ భారతదేశంలో విధులు నిర్వహిస్తున్న BSF సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, భవిష్యత్తులో చెన్నై సెక్టర్ ద్వారా వివిధ సంక్షేమ సౌకర్యాలు, పరిపాలనా సహాయం, వైద్య సేవలు, విద్యా సౌకర్యాలను పొందగలరు. అందరం కలిసి బలమైన, సురక్షితమైన అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంత‌కుముందు బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్ లో నూతనంగా నిర్మించిన పరిపాలనా, నివాస సౌకర్యాల భవనాలను ప్రారంభించారు. రూ.11.07 కోట్లతో నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ (Adm Block)ను, రూ. 4.74 కోట్ల వ్యయంతో నిర్మించిన గెటిజెట్ ఆఫీసనర్స్ భవనాన్ని. రూ.9.86 కోట్ల వ్యయంతో నిర్మించిన సిబ్బంది బ్యారక్‌ను, రూ.5.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సబార్డినేట్ అధికారుల భవనాన్ని ప్రారంభించారు. బీఎస్ఎఫ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG), సెవాంగ్ నాంగ్యాల్, ప్రత్యేక డైరెక్టర్ జనరల్(CPWD) ఇంజనీర్ వివేక్ నంద్ వివేక్, చీఫ్ ఇంజినీర్ (దక్షిణ ప్రాంతం), CPWD, చెన్నై ఎ.శ్రీనివాస రావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫ్రంటియర్ హెడ్‌క్వార్టర్స్,(ఒడిశా) సి.హెచ్. సేతురామ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, సెక్టర్ హెడ్‌క్వార్టర్స్, ( చెన్నై) విజయ్ సిన్హా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (CPWD చెన్నై) జి.ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement