Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
Revanth Reddy | దేశాన్ని సంఘ్ పరివార్ నుంచి రక్షించడానికి గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
- దేశంలో సంఘ్ పరివార్, గాంధీ పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోంది
- సంఘ్ పరివార్ దేశానికి, ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదకారి
- కేరళంలో బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు స్వీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: దేశాన్ని సంఘ్ పరివార్ నుంచి రక్షించడానికి గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘ్ పరివార్‌ను ఓడించేందుకు దేశమంతా గాంధీ పరివార్‌కు అండగా ఉండాలని కోరారు. సంఘ్ పరివార్ దేశానికి, ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదకారిగా మారిందని ఆరోపించారు. కేరళంలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన ఆర్యదాన్ ముహమ్మద్ - 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఉత్తమ ప్రజా సేవకుడి రేవంత్ రెడ్డి అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. అందులో ఒకటి సంఘ్ పరివార్, రెండోది గాంధీ పరివార్ అని చెప్పారు. సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం.. ఇలా అన్ని విధాలుగా విడగొడుతోందని మండిపడ్డారు. కానీ గాంధీ పరివార్ దేశం కోసం అన్నీ ఇచ్చిందని కొనియాడారు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.
కేరళం సంకేతాలిచ్చింది..
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి లాంటి పదవులను త్యాగం చేశారని చెప్పారు. సంఘ్ పరివార్‌ను ఓడించి ఈ యుద్ధంలో ముందున్నామని కేరళ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిందని ప్రశంసించారు. తాను జడ్పీటీసీతో ప్రారంభించి ముఖ్యమంత్రి స్థానాన్ని చేరుకున్నానన్నారు. ఇక తాను సాధించాల్సింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఇకపై రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతోనే ముందుకు సాగుతానని పునరుద్ఘాటించారు.
కాగా అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపి కే.సీ. వేణుగోపాల్ చేతుల మీదుగా రేవంత్‌రెడ్డి అవార్డు స్వీకరించారు. కేరళ దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గాను రేవంత్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
- ●Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?
- ●Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే
- ●Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
- ●Gujarat Handicrafts | శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా

Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..

Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..

హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?

Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే



