Team India | తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడనున్నది భారత్..!
Team India | భారత క్రికెట్ జట్టు మరో విదేశీ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 27 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది.
Team India | భారత క్రికెట్ జట్టు మరో విదేశీ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 27 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–2027 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో స్థానం మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యంతో భారత్, శ్రీలంక జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. స్పిన్‌కు అనుకూలించే గాలే పిచ్‌పై ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతుంది. రెండు మ్యాచ్‌లు కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 48.15 విజయాల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఫలితాలు ర్యాంకింగ్స్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. గతసారి శ్రీలంకలో భారత్ టెస్ట్ సిరీస్ ఆడింది 2017లోనే. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆ పర్యటనలో టీమిండియా 3–0 తేడాతో శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అదే గడ్డపై టెస్ట్ సిరీస్ జరగడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
జులై 19, 2026

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
జులై 19, 2026

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
జులై 19, 2026
తాజావార్తలు
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
- ●IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?

MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి

IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు



