త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs WI | వెస్టిండీస్‌తో కీల‌క మ్యాచ్‌.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా..

IND Vs WI | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్‌-వెస్టిండీస్ మ‌ధ్య మ‌రికొద్ది సేప‌ట్లో కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రుగుతున్న సూప‌ర్ 8 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

P

Sports | Published On Mar 1, 2026, 6.47 pm IST

IND Vs WI | వెస్టిండీస్‌తో కీల‌క మ్యాచ్‌.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా..
Advertisement

IND Vs WI | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్‌-వెస్టిండీస్ మ‌ధ్య మ‌రికొద్ది సేప‌ట్లో కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రుగుతున్న సూప‌ర్ 8 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేద‌ని, జింబాబ్వేతో ఆడిన జ‌ట్టునే కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపాడు. వెస్టిండిస్ మాత్రం బ్రాండన్ కింగ్ స్థానంలో అకేల్ హోసేన్ తీసుకుంది. ఈ మ్యాచ్ రెండుజ‌ట్లుకు కీల‌కం. ఇందులో గెలిచిన జ‌ట్టు మాత్ర‌మే సెమీస్‌కు వెళ్తుంది.

గెలిస్తే ఇంగ్లండ్‌తో సెమీస్‌లో పోరు..

ఇదిలా ఉండ‌గా.. జింబాబ్వేపై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యాన్ని న‌మోదు చేసి సెమీస్‌లోకి అడుగుపెట్టాల‌ని భావిస్తోంది. గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిస్తే.. గ్రూప్‌-లో అగ్ర‌స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో తలపడే అవకాశం ఉంది.

వెస్టిండీస్‌పై భార‌త్‌దే ఆధిప‌త్యం..

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ భారత్ అచ్చొచ్చిన మైదానం. ఇక్క‌డ మెన్ ఇన్ బ్లూకి తిరుగులేని రికార్డు ఉంది. 2011 అక్టోబర్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్ప, ఆ తర్వాత ఇక్కడ ఆడిన ఏడు టీ20 మ్యాచుల్లో భారత్ వరుస విజయాలు సాధించింది. 2016 నుంచి ఇప్పటివరకు భారత్ ఈడెన్‌లో ఓడిపోలేదు, ప్రత్యేకంగా వెస్టిండీస్‌పై భారత రికార్డు అద్భుతంగా ఉంది. ఇక్కడ విండీస్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. చివరగా, 2022 ఫిబ్రవరిలో ఇక్కడ విండీస్‌ను ఓడించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు జ‌ట్లు 30 సార్లు తలపడగా, భారత్ 19 సార్లు గెలిచింది, విండీస్ 10 సార్లు, ఒక మ్యాచ్ ఫలితం తెలియలేదు.

భార‌త జ‌ట్టు : సంజు శాంస‌న్‌, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివ‌మ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్ జ‌ట్టు : షాయ్ హోప్ (వికెట్ కీప‌ర్‌-కెప్టెన్‌), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మైర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

Advertisement
Advertisement