IND Vs USA | టీమిండియాకు భారీ షాక్.. యూఎస్ఏతో మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరం..!
IND Vs USA | టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్నది. శనివారం యునైటెడ్ స్టేట్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నది.
IND Vs USA | టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్నది. శనివారం యునైటెడ్ స్టేట్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నది. బుమ్రా ఆరోగ్యం బాగోలేదని.. దాంతో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదని తెలుస్తోంది. బుమ్రా విషయంలో టీమ్ యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అమెరికాపై భారత జట్టు చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు యాజమాన్యం బుమ్రా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
బుమ్రా నెట్ ప్రాక్టీస్ చేయకపోవడంతో ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడని, మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే అతని స్థానంలో సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్‌ను జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోతే.. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఉంది. మరో ఎండ్‌లో సిరాజ్ ఆ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. గ్రూప్ దశలో తర్వాతి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న నమీబియాతో, 15న కొలంబోలో శ్రీలంకతో, 18న నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. బంగ్లాదేశ్‌కు మద్దతు ప్రకటించిన పాక్.. భారత్‌తో ఆడేందుకు నిరాకరించింది. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. కీలక మ్యాచ్‌ల వరకు బుమ్రా ఫిట్‌గా ఉండేందుకు లీగ్ మ్యాచుల్లో విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్ వరకు అందుబాటులో ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






