త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs SA | రెచ్చిపోయిన మిల్ల‌ర్‌, స్ట‌బ్స్‌.. టీమిండియా టార్గెట్ 188 ర‌న్స్‌..!

IND Vs SA | టీమిండియాకు ద‌క్షిణాఫ్రికా 188 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో వికెట్ల న‌ష్టానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ ద‌క్షిణాఫ్రికాకు రెండో ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది.

P

Sports | Published On Feb 22, 2026, 8.55 pm IST

IND Vs SA | రెచ్చిపోయిన మిల్ల‌ర్‌, స్ట‌బ్స్‌.. టీమిండియా టార్గెట్ 188 ర‌న్స్‌..!
Advertisement

IND Vs SA | టీమిండియాకు ద‌క్షిణాఫ్రికా 188 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో వికెట్ల న‌ష్టానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ ద‌క్షిణాఫ్రికాకు రెండో ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. క్వింటన్ డి కాక్ ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేసి జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లోనే కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (4) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు.

నాలుగో ఓవ‌ర్‌లో ర్యాన్ రికెల్ట‌న్ (7) బుమ్రా బౌలింగ్‌లోనే శుభ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప‌వ‌ర్ ప్లేలోనే ద‌క్షిణాఫ్రికా మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లోప‌డింది. ఆ త‌ర్వాత డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ జోడీ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ఇద్ద‌రు క‌లిసి నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 97 ప‌రుగులు జోడించారు. ఇద్ద‌రు ఫోర్లు, సిక్స‌ర్ల‌తో భార‌త బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12.2 ఓవ‌ర్ వ‌ద్ద బ్రేవిస్ అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 45 ప‌రుగులు చేసిన బ్రేవిస్‌ను శుభ‌మ్ పెవిలియ‌న్‌కు పంపాడు. మ‌రో వైపు డేవిడ్ మిల్ల‌ర్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

ఆ త‌ర్వాత వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద తిల‌క్ వ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. మిల్ల‌ర్ 35 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల స‌హాయంతో 63 ప‌రుగులు చేసి ద‌క్షిణాఫ్రికాను మంచి స్కోర్ చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత మార్కో జాన్స‌న్ (2), కార్బిన్ బాష్ (5) ప‌రుగులు చేశారు. చివ‌ర‌లో స్ట్రిబ్స‌న్ స్ట‌బ్స్ 24 బంతుల్లో మూడు సిక్స‌ర్లు, ఒక ఫోర్ స‌హాయంతో 44 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అర్ష్‌దీప్ సింగ్‌కి రెండు, శుభ‌మ్ దూబే, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఒక్కో వికెట్ తీశారు.

Advertisement
Advertisement