IND Vs SA | దక్షిణాఫ్రికాపై తిరుగులేని రికార్డు.. నేటి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కొనసాగేనా..?
IND Vs SA | టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం కీలక మ్యాచ్ జరుగనున్నది. దక్షిణాఫ్రికా జట్టును భారత జట్టు ఢీకొట్టబోతున్నది. 2024 టీ20 ప్రపంచప్‌లో రెండుజట్లు ఫైనల్‌లో తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై భారత్ పైచేయిగా ఉన్నది.
IND Vs SA | టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం కీలక మ్యాచ్ జరుగనున్నది. దక్షిణాఫ్రికా జట్టును భారత జట్టు ఢీకొట్టబోతున్నది. 2024 టీ20 ప్రపంచప్‌లో రెండుజట్లు ఫైనల్‌లో తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై భారత్ పైచేయిగా ఉన్నది. 2006 నుంచి రెండు జట్ల మధ్య టీ20ల్లో 35 మ్యాచులు జరిగాయి. ఇందులో భారత్ 21సార్లు, ప్రొటీస్ 13 సార్లు గెలువగా.. ఒకటి డ్రాగా ముగిసింది. భారత్ విజయ శాతం 60శాతంగా ఉంది.
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో దక్షిణాఫ్రికాపై భారత్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రెండుజట్ల మధ్య ఏడు మ్యాచులు జరిగాయి. ఇందులో భారత్ ఐదుసార్లు గెలిచింది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. భారత్-దక్షిణాఫ్రికా చివరిసారిగా 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో టీ20 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచులు..
2007 : భారత్ 37 పరుగుల తేడాతో గెలిచింది.
2009 : భారత్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2010 : భారత్ 14 పరుగుల తేడాతో గెలిచింది.
2012: భారత్ ఒక పరుగు తేడాతో విక్టరీ.
2014: భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
2022 ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఓటమి.
2024 ఫైనల్ : భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది.
అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరంటే..?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా సౌతాఫ్రికా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ మిల్లర్ పేరిట ఉంది. 28 మ్యాచుల్లో 536 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాత స్థానంలో క్వింటన్ డి కాక్ 15 మ్యాచుల్లో 507 పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. ఇక భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు తిలక్ వర్మ పేరిట ఉంది. ఇప్పటి వరకు 496 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (429), సూర్యకుమార్ యాదవ్ (406) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సూర్య ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు.
అత్యధిక సిక్సర్లు బాదింది మిల్లర్..
అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్నది. భారత్‌పై 36 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత భారత్‌కు చెందిన తిలక్ వర్మ 28 సిక్సర్లతో రెండోస్థానంలో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 25 సిక్సర్లు కొట్టగా, క్వింటన్ డి కాక్ 24 సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో క్లాసెన్‌తో సమానంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 25 సిక్సర్లు కొట్టాడు. అయితే, క్లాసెన్ రిటైర్డ్ అయిన విషయం తెలిసిందే. ఇది భారత్‌కు ఊరట కలిగించే విషయం.
అత్యధిక వికెట్లు తీసింది ఎవరో తెలుసా..?
రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక వికెట్ల తీసిన ప్లేయర్‌గా అర్ష్‌దీప్ సింగ్ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఎనిమిది మ్యాచుల్లో 22 వికెట్లు కూల్చాడు. ఇందులో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరపున లుంగీ న్గిడి భారత్‌పై 16 వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (14 వికెట్లు) జాబితాలో ఉన్నారు. గణాంకాల విషయానికి వస్తే అర్ష్‌దీప్ 3/20, వరుణ్ చక్రవర్తి (5/17), లుంగి న్గిడి (4/29), కేశవ్ మహారాజ్ (2/23), భువనేశ్వర్ కుమార్ (5/24) ఉన్నాయి.
భారత్ తన ఆధిపత్యం..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో భారత్ తన ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాదించింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి.. సూపర్ 8లోకి దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికా సైతం అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించింది, కెనడా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, యూఏఈలపై విజయం సాధించింది. రెండు జట్లు తిరుగులేని ఆటతీరుతో సూపర్ 8లోకి ప్రవేశించాయి. నేడు జరుగనున్న మ్యాచ్ ఆద్యాంతం ఉత్కంఠంగా సాగనున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






