త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ind Vs Nz | రాజ్‌కోట్ వ‌న్డేలో రికార్డుల మోత మోగించిన డారిల్ మిచెల్‌..!

Ind Vs Nz | భార‌త-న్యూజిలాండ్ మ‌ధ్య రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ రికార్డుల మోత మోగించాడు. ఈ సిరీస్‌లో అజేయంగా 352 ప‌రుగులు చేశాడు. మూడు మ్యాచుల ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్‌లో ఏ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం.

P

Sports | Published On Jan 18, 2026, 6.43 pm IST

Ind Vs Nz | రాజ్‌కోట్ వ‌న్డేలో రికార్డుల మోత మోగించిన డారిల్ మిచెల్‌..!
Advertisement

Ind Vs Nz | భార‌త-న్యూజిలాండ్ మ‌ధ్య రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ రికార్డుల మోత మోగించాడు. ఈ సిరీస్‌లో అజేయంగా 352 ప‌రుగులు చేశాడు. మూడు మ్యాచుల ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్‌లో ఏ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం. మూడో వ‌న్డేలో డారిల్ మిచెల్ 137 ర‌న్స్ చేశాడు. ఇంత‌కు ముందు మ్యాచుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

డారిల్ మిచెల్‌- గ్లెన్ ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 188 బంతుల్లో 219 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. వన్డే క్రికెట్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌కు ఇది రెండో అత్యధిక భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. ఇంతకు ముందు భారత్‌పై న్యూజిలాండ్ అత్యధిక వన్డే భాగస్వామ్యం 221* ర‌న్స్‌. 2022లో ఆక్లాండ్‌లో టామ్ లాథమ్-కేన్ విలియమ్సన్ ఈ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. గ్లెన్ ఫిలిప్స్ 83 బంతుల్లో 106 పరుగులు చేసి తన సెంచరీని పూర్తి చేసుకోగా.. మిచెల్ 137 పరుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు.

అలాగే, వ‌న్డే క్రికెట్‌లో భార‌త్‌పై డారిల్ మిచెల్‌కు నాలుగో సెంచ‌రీ. భారత్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో నాథ‌న్ ఆస్టిల్ ఐదు సెంచ‌రీల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 29 ఇన్సింగ్స్‌లో ఐదు సెంచ‌రీలు చేయ‌గా.. డారిల్ మిచెల్ కేవ‌లం 11 ఇన్నింగ్స్‌లోనే నాలుగు సెంచ‌రీలు సాధించాడు. ఆ త‌ర్వాత క్రిస్ క్రెయిన్ మూడు, రాస్ టేల‌ర్ మూడు సెంచ‌రీల‌తో ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక స్వ‌దేశంలో భార‌త్‌పై అత్య‌ధిక వ‌న్డేలు చేసిన బ్యాట్స్‌మెన్‌లో రెండోస్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియ‌ర్స్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అలాగే, భారత్‌పై న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ వ‌న్డేల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ నాలుగో బ్యాట్స్‌మెన్‌గా ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టికే నాలుగు సార్లు 130పైగా ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. 2022లో ఆక్లాండ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో టామ్ లాథ‌మ్ 145 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. 2023లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌న్డేలో మైఖేల్ బ్రాస్‌వెల్ 140 ర‌న్స్ చేశాడు. అదే ఏడాది ఇండోర్‌లో జ‌రిగిన వ‌న్డేలో డెవాన్ కాన్వే 138 ర‌న్స్ చేశాడు. ఇంత‌కు ముందు ఇండోర్ వ‌న్డేలోనే డారిల్ మిచెల్ 137 ప‌రుగులు చేయ‌గా.. 2023లో వాంఖ‌డేలో 134 ర‌న్స్‌.. తాజాగా రాజ్‌కోట్ వ‌న్డేలో 131 నాటౌట్‌గా నిలువ‌గా.. 2023 ధ‌ర్మ‌శాల వ‌న్డేలో 130 ర‌న్స్ చేశాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement