త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tilak Verma | న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. త‌ప్పుకున్న తిల‌క్ వ‌ర్మ‌

P

Sports | Published On Jan 26, 2026, 3.06 pm IST

Tilak Verma | న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. త‌ప్పుకున్న తిల‌క్ వ‌ర్మ‌
Advertisement

Tilak Verma | న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ నుంచి యంగ్ బ్యాట్స్‌మెన్ తిల‌క్ వ‌ర్మ త‌ప్పుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా వ‌రుస విజ‌యాల‌ను న‌మోదు చేసింది. ఈ మ్యాచులకు అందుబాటులో ఉన్న తిల‌క్‌.. మిగ‌తా రెండు మ్యాచులకు అందుబాటులో ఉండ‌డం లేద‌ని బీసీసీఐ వెల్ల‌డించింది. తిలక్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేద‌ని.. అందుకే న్యూజిలాండ్‌తో జరిగే మిగ‌తా మ్యాచులు ఆడ‌డం లేద‌ని, తిల‌క స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టులో కొన‌సాగుతాడ‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది.

ఈ సంద‌ర్భంగా తిల‌క్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. శిక్షణను తిరిగి ప్రారంభించాడ‌ని.. బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో పున‌రావాసం పొందుతున్నాడ‌ని చెప్పింది. అయితే, పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను సాధించేందుకు అద‌న‌పు స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుకు ముందు ముంబ‌యిలో జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని బీసీసీఐ పేర్కొంది. మిగ‌తా మ్యాచుల‌కు తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులో కొనసాగించాలని సెలక్షన్ కమిటీ సూచించింద‌ని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement