IND vs BAN | బంగ్లాదేశ్‌తో భారత్ సిరీస్ వాయిదా పడే ఛాన్స్..? ఐర్లాండ్ పర్యటన రద్దుకు కారణాలేంటో?
IND vs BAN | బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఐర్లాండ్ టూర్‌ను వాయిదా వేసుకుంది. అదే సమయంలో భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వాలని బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత జట్టుతో సిరీస్ గతేడాది జరగాల్సి ఉండగా.. ఈ ఏడాదికి వాయిదా పడింది.
IND vs BAN | బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఐర్లాండ్ టూర్‌ను వాయిదా వేసుకుంది. అదే సమయంలో భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వాలని బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత జట్టుతో సిరీస్ గతేడాది జరగాల్సి ఉండగా.. ఈ ఏడాదికి వాయిదా పడింది. కొత్త తేదీలు సూచించాలని బీసీబీ, క్రికెట్ ఐర్లాండ్‌ను కోరింది. అయితే, ఈ ఏడాదిలో బంగ్లాతో సిరీస్ ఆడలేమని ఐర్లాండ్ బోర్డు తెలిపింది. దాంతో రెండు బోర్డులు పరస్పర అంగీకారంతో సిరీస్‌ను వాయిదా వేశాయి.
బంగ్లాదేశ్ జట్టు ఐర్లాండ్ పర్యటన 2027లో జరిగే అవకాశం ఉంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు 2026 ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకోనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో.. టీ20లు సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌పై జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జట్టుకు 79 రేటింగ్ పాయింట్లు ఉండగా.. వెస్టిండీస్ (10వ స్థానం) కంటే ముందుంది. 2027 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించేందుకు బంగ్లాదేశ్ టాప్-8లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 మార్చి 31లోపు టాప్-8లో లేకపోతే క్వాలిఫయర్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుంది.
ఐర్లాండ్ పర్యటన వాయిదా పడడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్‌తో స్వదేశంలో సిరీస్‌లు ఆడుతుంది. అలాగే, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాంతో భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో మ్యాచులు ఆడేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంల భారత్-బంగ్లాదేశ్ మధ్య సిరీస్ జరుగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. టూర్ మళ్లీ వాయిదా పడితే 2027 ప్రపంచకప్‌కి ముందు బంగ్లాదేశ్‌కు ఇబ్బందికరంగా మారే ఛాన్స్ ఉంది. నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశాలను ప్రభావితం చేస్తుంది.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



