త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Under 19 World Cup | అరోన్‌ జార్జ్ బ్యాటింగ్ విధ్వంసం.. అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా..!

Under 19 World Cup | అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ విజ‌యాన్ని న‌మోదు చేసి ఫైన‌ల్‌కు చేరుకుంది. అరోన్‌ జార్జ్ సెంచరీతో చెల‌రేగ‌డంతో అఫ్గానిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

P

Sports | Published On Feb 4, 2026, 9.02 pm IST

Under 19 World Cup | అరోన్‌ జార్జ్ బ్యాటింగ్ విధ్వంసం.. అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా..!
Advertisement

Under 19 World Cup | అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ విజ‌యాన్ని న‌మోదు చేసి ఫైన‌ల్‌కు చేరుకుంది. అరోన్‌ జార్జ్ సెంచరీతో చెల‌రేగ‌డంతో అఫ్గానిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 41.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 311 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌తో భారత్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో 20 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. ఇప్పటివరకు అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉన్న‌ది. 2006లో ఐర్లాండ్‌పై 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ రికార్డును భారత్ అధిగమించింది. 20 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బద్దలు కొట్టి స‌గ‌ర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

భార‌త్‌కు ప‌దో ఫైన‌ల్‌..

ఇది భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌లో 16 సీజన్లలో 10వ ఫైనల్ కావడం విశేషం. ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో భారత్ అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరింది. 2016, 2018, 2020, 2022, 2024, 2026 వరుసగా ఆరోసారి టైటిల్ మ్యాచ్‌కు చేరడం మ‌రో విశేషం. ఇప్పటివరకు ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన భారత్, ఆరోసారి విజేతగా నిలిచే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న‌ది. శుక్రవారం జరిగే ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో యువ భార‌త్ తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ ఓడించింది.

వైభవ్-అరోన్‌ జోడీతో శుభారంభం

లక్ష్య ఛేదనలో భారత్‌కు వైభవ్ సూర్యవంశీ, అరోన్‌ జార్జ్ శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చాడు. వైభవ్ ఔటైన తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి అరోన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రెండో వికెట్‌కు ఇద్దరూ కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మాత్రే ఔటైనప్పటికీ అరోన్‌ దూకుడు తగ్గించకుండా సెంచరీ పూర్తి చేశాడు. జ‌ట్టు విజ‌యానికి ద‌గ్గ‌ర‌లో ఉండ‌గా.. అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది లాంఛనాన్ని పూర్తి చేశారు.

అరోన్‌ జార్జ్ మెరుపు సెంచరీ

భారత్ తరఫున అరోన్‌ జార్జ్ 104 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 115 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. విహాన్ మల్హోత్రా 47 బంతుల్లో మూడు ఫోర్లతో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వేదాంత్ త్రివేది ఆరు బంతుల్లో ఐదు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో నురిస్తానీ ఒమర్జాయ్ రెండు వికెట్లు, వాహిదుల్లా జద్రాన్‌కి ఒక వికెట్ ద‌క్కింది.

నియాజై-షినోజాదా శతకాలు వృథా..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్.. భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు తరఫున ఉజైరుల్లా నియాజై, ఫైసల్ షినోజాదా శతకాలు నమోదు చేశారు. నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేశాడు. ఉస్మాన్ సదత్ 39, ఖాలిద్ అహ్మద్‌జై 31 పరుగులు చేశారు. అజీజుల్లా మియాఖిల్ 12 పరుగులకే ఔటయ్యాడు. అబ్దుల్ అజీజ్ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement