IND vs AFG Test | ఏకైక టెస్ట్ భారత్‌దే.. అఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విక్టరీ
IND vs AFG Test | ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్‌పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదురోజులు మ్యాచ్ కేవలం మూడురోజుల్లేనే భారత్ ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కట్టడి చేసింది.
IND vs AFG Test | ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్‌పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదురోజులు మ్యాచ్ కేవలం మూడురోజుల్లేనే భారత్ ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కట్టడి చేసింది. దీంతో భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత్ ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. అయినా అఫ్ఘాన్ బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొమ్మిది వికెట్లు కోల్పోయిన అనంతరం అష్రఫ్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది.
ఇన్నింగ్స్ తేడాతో భారత్‌కు అతిపెద్ద విజయం
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో భారత్‌కు ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. అంతకుముందు 2018లో వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయమే అత్యుత్తమంగా ఉండేది. తాజా విజయంతో ఆ రికార్డును భారత జట్టు అధిగమించింది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పరిధిలో జరుగకపోవడంతో భారత్‌కు పాయింట్ల పట్టికలో ఎలాంటి లాభం ఉండబోదు.
అరంగేట్రంలోనే మెరిసిన మానవ్ సుతార్
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతివాటం స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అతడు, రెండో ఇన్నింగ్స్‌లో మరో వికెట్ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
బ్యాటింగ్‌లో విఫలం..
మ్యాచ్ మొత్తం అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా ఒక్కరే అర్ధశతకం నమోదు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా 50 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. సదీకుల్లా అతల్ 42 పరుగులతో జట్టు తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండు జట్లు ఈ నెల 13 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TG High Court | హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్కు షాక్.. ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు
జూన్ 8, 2026

Secunderabad Railway Station | శరవేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు.. ఇప్పటికే 64శాతం పూర్తి
జూన్ 8, 2026

Indian Railway | రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఆగస్టు నుంచే అమలు..!
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
- ●Dasoju Sravan Kumar | తెలంగాణ జనాక్రోశమే ఈ కవిత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం
- ●N Ramachander Rao | హిట్లర్ లాగే రేవంత్ ప్రభుత్వానికి మరణం తప్పదు : ఎన్ రామచందర్ రావు
- ●TG High Court | హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్కు షాక్.. ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు
- ●TMC MPs | మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ఎన్డీయేకి మద్దతిస్తూ స్పీకర్‌కు లేఖ రాసిన 20 మంది టీఎంసీ ఎంపీలు
- ●Ponguleti Srinivas Reddy | ప్రభుత్వ భూములు కాజేస్తే శాశ్వతంగా తొలగిస్తం

Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!

Dasoju Sravan Kumar | తెలంగాణ జనాక్రోశమే ఈ కవిత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం

N Ramachander Rao | హిట్లర్ లాగే రేవంత్ ప్రభుత్వానికి మరణం తప్పదు : ఎన్ రామచందర్ రావు

TG High Court | హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్కు షాక్.. ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు



