త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | వెస్టిండీస్ వుమెన్స్ జ‌ట్టుకు ఐసీసీ షాక్‌..!

ICC | వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుపై ఐసీసీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కార‌ణంగా కొనసాగించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఈ తప్పును జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ అంగీకరించింది.

P

Sports | Published On Mar 30, 2026, 9.05 pm IST

ICC | వెస్టిండీస్ వుమెన్స్ జ‌ట్టుకు ఐసీసీ షాక్‌..!
Advertisement

ICC | వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుపై ఐసీసీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కార‌ణంగా కొనసాగించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఈ తప్పును జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ అంగీకరించింది. ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్ణీత స‌మ‌యంతో పోలిస్తే వెస్టిండీస్ జ‌ట్టు రెండు ఓవ‌ర్లు త‌క్కువగా బౌలింగ్ చేసిన‌ట్లు గుర్తించారు. ఈ నిర్ణయాన్ని అంపైర్లు లారెన్ అజెన్‌బాగ్, కాండిస్ లా బోర్డ్, థర్డ్ అంపైర్ జాక్వెలిన్ విలియమ్స్, ఫోర్త్ అంపైర్ మారియా అబాట్ ఆమోదించారు.

తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 103 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా 90 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచుల‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్లకు 269 పరుగులు చేసింది. బెత్ మూనీ 65 పరుగులతో రాణించింది. వెస్టిండీస్ తరఫున కెప్టెన్ మాథ్యూస్ 3 వికెట్లు తీసుకోగా, అష్మిని మునిసార్, అఫీ ఫ్లెచర్ తలో 2 వికెట్లు సాధించారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 46 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 90 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మాథ్యూస్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లీ గార్డ్నర్, జార్జియా వేర్‌హామ్ తలో 3 వికెట్లు, తాలియా మెక్‌గ్రాత్ 2, అలానా కింగ్‌కు ఒక వికెట్ ద‌క్కింది. సిరీస్‌లో మూడో వన్డే మ్యాచ్ ఏప్రిల్ 2న జరగనుంది.

Advertisement
Advertisement