త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC T20I Rankings | న్యూజిలాండ్‌ సిరీస్‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌..! ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ దూసుకొచ్చిన సూర్య‌కుమార్..!

ICC T20I Rankings | న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచుల స్వ‌దేశీ టీ20 సిరీస్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగ‌బాకి ఏడో స్ఠానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న‌ది.

P

Sports | Published On Jan 28, 2026, 8.08 pm IST

ICC T20I Rankings | న్యూజిలాండ్‌ సిరీస్‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌..! ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ దూసుకొచ్చిన సూర్య‌కుమార్..!
Advertisement

ICC T20I Rankings | న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచుల స్వ‌దేశీ టీ20 సిరీస్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగ‌బాకి ఏడో స్ఠానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న‌ది. గ‌తంలో టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా కొన‌సాగిన సూర్య‌.. ఆ త‌ర్వాత ఫామ్ కోల్పోవ‌డంతో ర్యాంకు దిగ‌జారింది. తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడు మ్యాచుల్లోనూ 32, 82 నాటౌట్‌, 57 నాటౌట్‌గా నిలువ‌గా.. తాజాగా ర్యాంకింగ్స్‌లో మ‌ళ్లీ టాప్ టెన్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. ఇక ఐసీసీ నెంబ‌ర్ వ‌న్ టీ20 బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కొన‌సాగుతున్నాడు.

మూడోస్థానంలో తిల‌క్‌..

మూడో స్థానంలో తిల‌క్ వ‌ర్మ ఉన్నాడు. గాయం కార‌ణంగా తిల‌క్ వ‌ర్మ కివీస్‌తో జ‌రుగుతున్న సిరీస్‌కు ఆడ‌లేదు. రాయ్‌పూర్‌లో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 76 ప‌రుగులతో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిష‌న్ 64వ స్థానానికి చేరాడు. శివమ్ దుబే కూడా తొమ్మిది స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకోగా, రింకు సింగ్ 13 స్థానాలు ఎగబాకి 68వ స్థానానికి చేరుకున్నాడు. దుబాయిలో వెస్టిండిస్‌తో జ‌రిగిన సిరీస్‌లో రాణించిన ఆఫ్ఘ‌నిస్తాన్ ఓపెన‌ర్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ రెండుస్థానాలు ఎగ‌బాకి 13వ స్థానానికి చేరాడు. రహ్మానుల్లా గుర్బాజ్ మూడు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 47 బంతుల్లో అజేయంగా 86 పరుగులు చేయడంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి ప్రవేశించాడు. అదే సమయంలో, వెస్టిండీస్‌కు చెందిన బ్రాండన్ కింగ్ 15 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి, న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ 18 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి చేరారు.

ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్ శ‌ర్మ 292 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ 849 పాయింట్ల‌తో రెండోస్థానం, తిల‌క్ వ‌ర్మ మూడోస్థానంలో ఉండ‌గా.. మ‌రో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బ‌ట్ల‌ర్ 770 రేటింగ్ పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. పాక్తిసాన్ బ్యాట్స్‌మెన్ షాహిబ్జాదా ఫ‌ర్హాన్ ఐదు, పాతుమ్ నిస్సంక (శ్రీ‌లంక‌) ఆరు, సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌) ఏడు, ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) ఎనిమిది, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) తొమ్మిది, టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్‌) ప‌దో స్థానంలో ఉన్నాడు.

నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి..

టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండి స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 787 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఐదు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా నాలుగు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరారు. దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్ ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమ 32వ స్థానానికి చేరుకున్నాడు. రెండోస్థానంలో ర‌షిద్ ఖాన్ (ఆఫ్ఘ‌నిస్తాన్‌), మూడోస్థానంలో వ‌నిందు హ‌స‌రంగ (శ్రీ‌లంక‌) ఉన్నారు. ఆ ర్యాంకుల్లో జాక‌బ్ డ‌ఫీ (న్యూజిలాండ్‌), అబ్రార్ అహ్మ‌ద్ (పాకిస్తాన్‌), ముస్తాఫిజుర్ రెహ‌మాన్ (బంగ్లాదేశ్‌), నాథ‌న్ ఎల్లిస్ (ఆస్ట్రేలియా), ముజీబ్ ఉర్ రెహ‌మాన్ (ఆప్ఘ‌నిస్తాన్‌), ఆడం జంపా (ఆస్ట్రేలియా) ఉన్నారు.

ఆల్‌రౌండ‌ర్ల‌లో మూడోస్థానానికి పాండ్యా..

ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో పాండ్యా మూడవ స్థానానికి చేరుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో పాండ్యా ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ 17 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకోగా.. జో రూట్ 23వ స్థానం నుంచి 17వ స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వే ప్లేయ‌ర్ సికంద‌ర్ ర‌జా అగ్ర‌స్థానంలో ఉన్నాడు. సామ్ ఆయూబ్ (పాక్‌), రోస్ట‌న్ ఛేస్ (వెస్టిండిస్‌), మ‌హ్మ‌ద్ న‌బీ (పాక్‌), దీపేంద్ర‌సింగ్ అరి (నేపాల్‌), అజ్మ‌తుల్లా ఉమ‌ర్జాయ్ (ఆఫ్ఘ‌న్‌), రొమారియో షెప్ప‌ర్డ్ (వెస్టిండిస్‌), మ‌హ్మ‌ద్ న‌బీ (ఆఫ్ఘ‌న్‌), వ‌నిందు హ‌స‌రంగ (శ్రీ‌లంక‌) ఆ త‌ర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement