ICC T20I Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్-5లోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్..!
ICC T20I Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి ప్రవేశించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా టాప్-10లోకి వచ్చాడు.
ICC T20I Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి ప్రవేశించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా టాప్-10లోకి వచ్చాడు. బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రస్తుతం 877 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), సాహిబ్జాదా ఫర్హాన్ (పాక్), పాతుమ్ నిస్సంక (శ్రీలంక) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఇటీవల ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అదరగొట్టాడు. దాంతో మూడుస్థానాలు ఎగబాకి ఐదోస్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (భారత్), తిలక్ వర్మ (భారత్), జోస్ బట్లర్ (ఎనిమిది), డెవాల్డ్ బ్రూవిస్ (తొమ్మిది) టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్) స్థానంలో ఉన్నారు.
బౌలర్స్ ర్యాక్సింగ్‌లో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్, వెస్టిండీస్‌కు చెందిన మాథ్యూ ఫోర్డ్, భారత్‌కు చెందిన జస్‌ప్రీత్ బుమ్రా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రెండోస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్ 21 స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రెండు స్థానాలు దిగజారి ఐదవ స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన మాథ్యూ ఫోర్డ్ ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. 23 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కి చేరాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ప్రదర్శన ఆధారంగా బుమ్రా కూడా టాప్ 10లోకి ప్రవేశించాడు. బుమ్రా 7 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ తొమ్మిదో స్థానంలో ఉండగా, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ పదో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ కప్ నుంచి గాయం కారణంగా వైదొలిగిన హసరంగ నాలుగు స్థానాలు కోల్పోయాడు. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో ఏడుగురు స్పిన్నర్లు ఉండడం విశేషం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






