త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC T20I Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మ‌నోళ్ల‌దే హ‌వా..! టాప్ ప్లేస్‌లో అభిషేక్‌, వ‌రుణ్‌..!

ICC T20I Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం తాజా టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ ర్యాంకింగ్స్‌ని బుధ‌వారం విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ర్యాంకింగ్స్‌లో త‌మ ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్నారు.

P

Sports | Published On Feb 18, 2026, 7.30 pm IST

ICC T20I Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మ‌నోళ్ల‌దే హ‌వా..! టాప్ ప్లేస్‌లో అభిషేక్‌, వ‌రుణ్‌..!
Advertisement

ICC T20I Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం తాజా టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ ర్యాంకింగ్స్‌ని బుధ‌వారం విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ర్యాంకింగ్స్‌లో త‌మ ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్నారు. ఇద్ద‌రు బ్యాటింగ్‌, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నారు. పాకిస్తాన్‌కు చెందిన సైమ్ అయూబ్ జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాను అధిగమించి ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి చేరాడు.

తాజా ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో సైమ్ అయూబ్ మరోసారి నంబర్ వ‌న్ టీ20 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. అయూబ్, జింబాబ్వేకు చెందిన సికందర్ రజా మధ్య తీవ్ర‌మైన పోటీ కొన‌సాగింది. ఇద్ద‌రు ప్లేయ‌ర్లు అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. తాజాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్‌పై మూడు వికెట్లు పడగొట్టడంతో అయూబ్ మళ్లీ అగ్రస్థానాన్ని దూసుకొచ్చారు. సికింద‌ర్ ర‌జా రెండోస్థానంలో ఉన్నాడు. నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరి రెండుస్థానాలు మెరుగుప‌రుచుకున్నాడు. అఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్‌తో క‌లిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు.

టాప్ 10లోకి ఇషాన్ కిష‌న్‌..

శ్రీలంక డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ పాతుమ్ నిస్సాంక మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరాడు. కాండీలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ చేసిన విష‌యం తెలిసిందే. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవ‌ల పేల‌వ‌ఫామ్‌ను కొన‌సాగించిన ఇంకా అగ్ర‌స్థానంలోనే ఉన్నాడు. టీమిండియా మ‌రో బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్ 17 స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిది స్థానానికి చేరాడు. ద‌క్షిణాఫ్రికాకు చెందిన ర్యాన్ రికెల్ట‌న్ 11వ స్థానానికి, ఐడెన్ మార్క్రామ్ 15వ ప్లేస్‌కి, అమెరికాకు చెందిన సాయితేజ ముక్క‌మ‌ల్ల 21వ స్థానం, ఇంగ్లండ్ యువ ప్లేయ‌ర్ జాక‌బ్ బెథెల్ 32వ స్థానానికి చేరుకున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్ ఇలా..

బౌల‌ర్స్ ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ ప్లేస్ కోసం ఆస‌క్తిక‌ర పోటీ జ‌రుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం భార‌త్‌కు చెందిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఎవాన్స్ వరుసగా రెండు మ్యాచుల్లో మూడు వికెట్లు తీసిన తీశాడు. దాంతో 10 స్థానాలు ఎగబాకి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. భార‌త్‌కు చెందిన అక్షర్ పటేల్ 14, జ‌స్‌ప్రీత్ బుమ్రా 15, ఐర్లాండ్ స్పిన్న‌ర్ మాథ్యూ హంఫ్రీస్ 23వ ర్యాంక్‌కి చేరాడు.

Advertisement
Advertisement