త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఇషాన్‌..! నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి..!

ICC T20 Rankings | న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. చాలారోజుల త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చిన యువ బ్యాట‌ర్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అల‌రించాడు.

P

Sports | Published On Feb 4, 2026, 6.09 pm IST

ICC T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఇషాన్‌..! నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి..!
Advertisement

ICC T20 Rankings | న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. చాలారోజుల త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చిన యువ బ్యాట‌ర్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అల‌రించాడు. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 32 స్థానాలు ఎగ‌బాకి 32వ ర్యాంక్‌కి చేరాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో 8, 76, 28, 103 ప‌రుగులు చేశాడు. కీల‌క టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కి ముందు భార‌త్ సిరీస్‌ను 4-1 తేడాతో గెలువ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అదే స‌మ‌యంలో టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో స్వ‌ల్ప మార్పులు జ‌రిగాయి. అభిషేక్ శర్మ 917 రేటింగ్ పాయింట్ల‌తో అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ రెండోస్టానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాతి స్థానాల్లో జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లండ్‌), తిల‌క్ వ‌ర్మ (భార‌త్‌), పాతుమ్ నిస్సంక (శ్రీ‌లంక‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌), సాహిబ్జాదా ఫర్హాన్ (పాక్‌), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), టిమ్ సీఫెర్ట్ (ఆస్ట్రేలియా), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ ర్యాన్ రికెల్టన్ 42 స్థానాలు మెరుగుప‌రుచుకొని.. 40వ స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 14వ స్థానానికి, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్ 22వ స్థానానికి చేరారు.

పాకిస్తాన్ యువ ఓపెన‌ర్ సామ్ అయూబ్ ఐసీసీ మెన్స్ టీ20 ఆల్ రౌండ‌ర్ల జాబితాలో నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మెరిసాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను పాకిస్తాన్ 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. జింబాబ్వే ప్లేయ‌ర్ సికందర్ రజాను అధిగమించి తిరిగి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కి చేరాడు. 23 ఏళ్ల సామ్ అయూబ్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 119 పరుగులు. బంతితో మూడు వికెట్లు తీశాడు. ఇక బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో ఎనిమిది వేర్వేరు దేశాల ప్లేయ‌ర్లు టాప్‌-10 ర్యాంకుల్లో కొన‌సాగుతున్నారు. వెటరన్ ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ రెండు స్థానాలు మెరుగుప‌రుచుకొని నాల్గో ప్లేస్‌కి చేరాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ 23వ స్థానానికి చేరాడు.

స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రెండు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆరు వికెట్లు తీసిన తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో కూడా అతను ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. 776 పాయింట్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

Advertisement
Advertisement