ICC Rankings | ఐసీసీ నెంబర్-1 బ్యాట్‌వుమెన్‌గా స్మృతి మంధాన
ICC Rankings | మహిళల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ని ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన నెంబర్ వన్ ప్లేస్‌కి చేరుకుంది. 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న లారా వోల్వార్డ్‌ని వెనక్కి నెట్టి నెంబర్ బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది.
ICC Rankings | మహిళల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ని ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన నెంబర్ వన్ ప్లేస్‌కి చేరుకుంది. 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న లారా వోల్వార్డ్‌ని వెనక్కి నెట్టి నెంబర్ బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాట్‌తో రాణించడంతో రేటింగ్ పాయింట్లు పెరగడంతో ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ వన్డే బౌలింగ్ విభాగంలో తొలిసారి నంబర్ వన్‌గా నిలిచింది. 775 పాయింట్లతో ఆమె నెంబర్ వన్ బౌలర్‌గా ఘనత సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా మూడో వన్డేలో 4/33 గణాంకాలు నమోదు చేయడం ఆమె ర్యాంకుల్లో దూసుకెళ్లింది. దీర్ఘకాలంగా నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లవగ్ స్పిన్నర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ ర్యాంకు దిగజారింది. టా-8లో ఆస్ట్రేలియా బౌలర్లే ఎక్కువగా ఉన్నారు. అష్లె గార్డ్నర్ మూడో స్థానంలో ఉండగా, అన్నాబెల్ సదర్లాండ్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.
స్వదేశంలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది. బెత్ మూనీ, గార్డ్నర్, కెప్టెన్ అలిస్సా హీలీ రాణించారు. చివరి వన్డేలో సెంచరీ సాధించిన హీలీ 744 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానంలో ఉంది. బెత్ మూనీ 749 పాయింట్లతో ఆమె కంటే ముందుండగా.. గార్డ్నర్ 724 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో గార్డ్నర్ 516 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సిరీస్ ఓడిపోయినప్పటికీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్‌తో రాణించడంతో నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియా నుంచి దీప్తి శర్మ మాత్రమే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ సిరీస్ తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ ఐదు స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకుంది. ఫాతిమా సనా ఆల్‌రౌండర్ జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. అమీలియా కేర్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






