త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC ODI Rankings | ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయ‌ర్ల హ‌వా..! టాప్‌-10లో న‌లుగురు..!

ICC ODI Rankings | ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయ‌ర్ల హ‌వా కొన‌సాగుతున్న‌ది. న‌లుగురు భార‌త బ్యాట్స్‌మెన్ టాప్‌-10లో త‌మ స్థానాన్ని నిల‌బెట్టుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. టీమిండియా ర‌న్ మెషిన్ విరాట్ కోహ్లీ రెండోస్థానంలో ఉన్నాడు.

P

Sports | Published On Mar 18, 2026, 5.38 pm IST

ICC ODI Rankings | ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయ‌ర్ల హ‌వా..! టాప్‌-10లో న‌లుగురు..!
Advertisement

ICC ODI Rankings | ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయ‌ర్ల హ‌వా కొన‌సాగుతున్న‌ది. న‌లుగురు భార‌త బ్యాట్స్‌మెన్ టాప్‌-10లో త‌మ స్థానాన్ని నిల‌బెట్టుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. టీమిండియా ర‌న్ మెషిన్ విరాట్ కోహ్లీ రెండోస్థానంలో ఉన్నాడు. అఫ్ఘ‌నిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నాలుగో స్థానంలో ఉండ‌గా, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఐదో స్థానంలో, వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ తొమ్మిది స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండ‌గా.. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో గెలిచింది. తాజాగా ర్యాంకింగ్స్‌లో ప‌లువురు బ్యాట్స్‌మెన్ త‌మ ర్యాంకుల‌ను మెరుగుప‌రుచుకున్నారు.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ స‌ల్మాన్ అఘా టాప్‌-10 ర్యాంకింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్‌తో కలిసి సంయుక్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో 58.33 సగటుతో, 104.17 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 175 పరుగులు సాధించాడు. మిర్పూర్ షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో సల్మాన్ 98 బంతుల్లో 106 పరుగులు చేసినా.. పాక్ ఈ మ్యాచ్‌లో గెలువ‌లేక‌పోయింది.

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి, 3.33 ఎకానమీతో అద్భుత ప్రదర్శన చేశాడు. ర్యాంకింగ్స్‌లో అఫ్ఘ‌నిస్తాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. జోఫ్రా ఆర్చ‌ర్ (ద‌క్షిణాఫ్రికా), కేశవ్ మహారాజ్ (ద‌క్షిణాఫ్రికా), బెర్నార్డ్ స్కోల్ట్జ్ (న‌మీబియా) ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్‌) ఆ త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ (అఫ్ఘ‌నిస్తాన్‌) మొద‌టి స్థానంలో నిలువ‌గా.. సికంద‌ర్ ర‌జా (అఫ్ఘ‌నిస్తాన్‌), మ‌హ్మ‌ద్ న‌బీ (అఫ్ఘ‌నిస్తాన్‌) మూడోస్థానంలో నిలిచాడు. బంగ్లా ప్లేయ‌ర్ హ‌స‌న్ మిరాజ్ నాలుగు, ర‌షీద్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నారు. తంజిద్ హసన్ తమీమ్ 31 స్థానాలు ఎగబాకి 55వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ కూడా 12 స్థానాలు మెరుగుపరుచుకుని 28వ స్థానంలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన నాహిద్ రానా, 65 స్థానాలు ఎగబాకి వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి ప్రవేశించాడు.

మ‌హిళ ర్యాంకింగ్స్‌లో..

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన నాట్ స్కివ‌ర్ బ్రంట్, ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ, దక్షిణాఫ్రికా ప్లేయర్ లారా వోల్వార్డ్, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement

తాజావార్తలు

Advertisement