England vs DR Congo | హ్యారీ కేన్ మెరుపులు.. ప్రీక్వార్టర్స్‌కు ఇంగ్లండ్
England vs DR Congo | హ్యారీ కేన్ మ్యాజిక్ ఫర్ఫార్మెన్స్‌తో ఇంగ్లండ్ జట్టు ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. డీఆర్ కాంగోతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో డబుల్ గోల్స్ చేసి 2-1 ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముఖ్యంగా మ్యాచ్ చివరలో బాక్స్ వెలుపల నుంచి వేసిన మెరుపు గోల్‌తో ఇంగ్లండ్‌ను రౌండ్ ఆఫ్ 16కి చేర్చడంతో పాటు.. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న ప్రపంచకప్ గోల్స్ రికార్డును అధిగమించాడు.
- పీలే రికార్డు బద్దలు కొట్టిన కేన్
- 2-1 తేడాతో బ్రిటిష్ జట్టు విజయం
- ఇంటిబాట పట్టిన డీఆర్ కాంగో
England vs DR Congo | హ్యారీ కేన్ మ్యాజిక్ ఫర్ఫార్మెన్స్‌తో ఇంగ్లండ్ జట్టు ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. డీఆర్ కాంగోతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో డబుల్ గోల్స్ చేసి 2-1 ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముఖ్యంగా మ్యాచ్ చివరలో బాక్స్ వెలుపల నుంచి వేసిన మెరుపు గోల్‌తో ఇంగ్లండ్‌ను రౌండ్ ఆఫ్ 16కి చేర్చడంతో పాటు.. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న ప్రపంచకప్ గోల్స్ రికార్డును అధిగమించాడు.
ఆరంభంలో షాక్ ఇచ్చిన కాంగో..
మ్యాచ్ ఆరంభంలోనే డీఆర్ కాంగో షాక్ ఇచ్చింది. ఏడో నిమిషంలో బ్రియాన్ సిపెంగా గోల్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత గంటకుపైగా ఆధిక్యంలోనే మ్యాచ్ కొనసాగింది. అయితే, 75వ నిమిషంలో కేన్ గోల్ సాధించి ఇంగ్లండ్‌కు ఊపిరి పోశాడు. దాంతో స్కోర్ సమమైంది. ఆపై 86వ నిమిషంలో బాక్స్ అంచు నుంచి అద్భుతమైన షాట్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపాడు. డీఆర్ కాంగో గోల్‌కీపర్ లియోనెల్ ఎంపాసీ అడ్డుకోలేకపోయాడు. ఆ గోల్‌తో ఇంగ్లండ్ 2-1తో విజయం సాధించి సహ ఆతిథ్య దేశం మెక్సికోతో జరిగే ప్రీక్వార్టర్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అనంతరం డీఆర్ కాంగో కోచ్ సెబాస్టియన్ డెసాబ్రే తమ జట్టు పోరాటాన్ని ప్రశంసించాడు. ‘ఇంగ్లండ్‌ను చాలా వరకు కట్టడి చేశాం. కానీ పెద్ద జట్ల ప్రత్యేకత అదే. ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రయికర్ వారిని కాపాడాడు. మేం గెలుపుకు చాలా దగ్గరగా వచ్చాం. ఓడిపోయినా మా ప్రదర్శనపై గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించాడు. టోర్నీలో తమ జట్టు ఐదు గోల్స్ నమోదు చేసిందని, తమకంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న జట్లతో పోటీపడి మంచి ఫలితాలు సాధించామని డెసాబ్రే పేర్కొన్నారు. ‘ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడం నిరాశ కలిగించినా.. దేశానికి మంచి పేరు తీసుకొచ్చామని భావిస్తున్నాం’ అని చెప్పాడు.
మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన కేన్..
మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి దాదాపు ఖాయమనిపించింది. డీఆర్ కాంగో డిఫెన్స్ పటిష్టంగా నిలువగా.. గోల్‌కీపర్ ఎంపాసీ అద్భుత సేవ్‌లతో ఇంగ్లండ్‌ను నిరాశపరిచాడు. జూడ్ బెల్లింగ్‌హామ్, మార్కస్ రాష్‌ఫోర్డ్, కేన్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నాడు. మరోవైపు యోయానే విస్సా కొట్టిన షాట్ పోస్ట్‌ను తాకగా.. కేన్‌కు దక్కాల్సిన పెనాల్టీ అప్పీల్‌ను కూడా రిఫరీ తిరస్కరించాడు. అయితే, చివరలో కెప్టెన్ కేన్ తన అనుభవాన్ని చాటాడు. తొలి గోల్‌తో పీలే ప్రపంచకప్ గోల్స్ రికార్డును సమం చేసిన అతను.. రెండో గోల్‌తో ఆ రికార్డును అధిగమించాడు. ఆ అద్భుత గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్‌లో విక్టరీ సాధించడంపై కేన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతమైన అనుభూతి. ప్రత్యర్థి గోల్‌కీపర్ తొలి అర్ధభాగంలో అసాధారణంగా ఆడాడు. అయినా అవకాశాలు వస్తాయని నమ్మకం కోల్పోలేదు’ అని పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు ఒత్తిడి సమయంలో ఎవరో ఒకరు హీరోగా నిలవాల్సి ఉంటుందని జట్టు సభ్యులతో చర్చించామని కేన్ వెల్లడించాడు. ‘అది నేను కావచ్చు, గోల్‌కీపర్ సేవ్స్ కావొచ్చు. డిఫెండర్ల బ్లాక్ కావొచ్చు. ఈ సారి ఆ అవకాశం నాకు వచ్చింది’ అని చెప్పాడు.
మరో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్
ఈ రెండు గోల్స్‌తో హ్యారీ కేన్ ఇంగ్లండ్ తరఫున మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే పనామాపై మ్యాచ్‌లో గ్యారీ లినేకర్ ప్రపంచకప్ గోల్స్ రికార్డును అధిగమించిన కేన్.. తాజాగా పీలే పేరిట ఉన్న 12 ప్రపంచకప్ గోల్స్ రికార్డును దాటి 13 గోల్స్‌తో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన కేన్.. గోల్డెన్ బూట్ పోటీలో లియోనెల్ మెస్సీ కంటే కేవలం ఒక గోల్ వెనుకంజలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు 117 మ్యాచ్‌లు ఆడిన కేన్ మొత్తం 84 గోల్స్ నమోదు చేశాడు. ప్రధాన అంతర్జాతీయ టోర్నీల్లో అతని గోల్స్ సంఖ్య 20కి చేరింది. డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్ అతనికి ప్రపంచకప్‌లో 15వ ఆరంభ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లలో ఇదే అత్యధికం. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులతో కలిసి ‘వండర్‌వాల్’ పాట పాడిన కేన్.. ఇలాంటి విజయాలను ఆస్వాదించాలని సహచరులకు సూచించాడు. ‘మేం తర్వాతి రౌండ్‌కు చేరుకున్నా. ప్రతి విజయాన్ని ఆస్వాదించాలి. నాలుగు రోజుల తర్వాత మరో కీలక పోరుకు సిద్ధమవుతాం’ అని పేర్కొన్నాడు.
Harry Kane Scored against 3 defenders from an insane angle.
What a Goal from King Kane.😍 pic.twitter.com/T1uFc1mNB1
— 𝘽𝙚𝙣𝙟𝙞𝙁𝘾𝘽 ¹⁷ (@Official_Benji_) July 1, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్
- ●Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్
- ●IBPS | 6715 పోస్టులతో IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్..
- ●Belgium Vs Senegal | చెదిరిన సెనెగల్ కల
- ●Tiger Reserve Zones | తెలంగాణలో పులుల సంతానోత్పత్తి..! జనసంచారంపై నిషేధం..!!
- ●Rain Alert | రాగల 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు..!

Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్

Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్

IBPS | 6715 పోస్టులతో IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్..

Belgium Vs Senegal | చెదిరిన సెనెగల్ కల





