త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup | ఫుట్‌బాల్ మహాసమరంలో రసవత్తర పోరు..!

FIFA World Cup | ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మూడోరోజు మ్యాచులు అభిమానుల‌ను ఉత్కంఠ‌కు గురి చేశాయి. ఆదివారం ఐదు మ్యాచులు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇందులో నాలుగు మ్యాచులు ముగిశాయి. చివ‌రి మ్యాచ్‌లో జ‌ర్మ‌నీ-కురాకో మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్ భార‌త‌కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు జ‌రుగ‌నున్న‌ది. మూడో రోజు పోటీల్లో ఖతార్ చివరి నిమిషాల్లో అద్భుతంగా పుంజుకుని స్విట్జర్లాండ్‌ను నిలువ‌రించింది.

P

Sports | Published On Jun 14, 2026, 4.49 pm IST

FIFA World Cup | ఫుట్‌బాల్ మహాసమరంలో రసవత్తర పోరు..!
Advertisement
  • తుర్కియేకు ఆసిస్ షాక్‌.. 2-1 తేడాతో గెలుపు
  • స్విట్జ‌ర్లాండ్‌-ఖ‌తార్ మ్యాచ్ డ్రా
  • బ్రెజిల్‌కు స‌వాల్ విసిరిన మొరాకో
  • స్కాట్లాండ్‌కు తొలి విజ‌యం

FIFA World Cup | ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మూడోరోజు మ్యాచులు అభిమానుల‌ను ఉత్కంఠ‌కు గురి చేశాయి. ఆదివారం ఐదు మ్యాచులు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇందులో నాలుగు మ్యాచులు ముగిశాయి. చివ‌రి మ్యాచ్‌లో జ‌ర్మ‌నీ-కురాకో మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్ భార‌త‌కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు జ‌రుగ‌నున్న‌ది. మూడో రోజు పోటీల్లో ఖతార్ చివరి నిమిషాల్లో అద్భుతంగా పుంజుకుని స్విట్జర్లాండ్‌ను నిలువ‌రించింది. మొరాకో చేతిలో బ్రెజిల్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా మాత్రం టర్కియేపై ఏకపక్ష విజయం సాధించింది. మ‌రో మ్యాచ్ హైతిపై స్కాట్లాండ్ విజ‌యం సాధించింది.

ఖతార్ అద్భుతం

గ్రూప్‌-బీలో స్విట్జ‌ర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌ను ఖ‌తార్ 1-1తో డ్రా చేసుకుంది. మ్యాచ్ ముగిసే కొద్ది క‌క్ష‌ణాల ముందు బౌలెమ్ ఖౌఖీ గోల్ వేసి ఖతార్‌కు విలువైన ఒక పాయింట్ అందించాడు. 17వ నిమిషంలో బ్రెల్ ఎంబోలో పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం స్విస్ జట్టే పైచేయి సాధించినప్పటికీ, ప‌లు అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది. దీంతో ఖతార్‌కు తిరిగి మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం లభించింది. రెండో అర్ధభాగం ఇంజరీ టైమ్ నాలుగో నిమిషంలో ఖౌఖీ హెడ్డర్‌తో సమం చేశాడు. దీంతో ఖతార్ ఈ ప్రపంచకప్‌లో తొలి పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. గోల్ అనంతరం ఖతార్ ఆటగాళ్లు మైదానంలోనే సంబరాలు చేసుకోవడం ఆకట్టుకుంది.

బ్రెజిల్‌కు మొరాకో స‌వాల్‌..

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ తన తొలి మ్యాచ్‌లో స్థాయికి త‌గ్గ‌ట్లుగా ఆడ‌లేక‌పోయింది. గ్రూప్-సీలో మొరాకోతో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచే మొరాకో దూకుడుగా ఆడింది. తొలి 30 నిమిషాల్లోనే బ్రెజిల్ గోల్‌పోస్ట్ వైపు దూసుకువ‌స్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. 21వ నిమిషంలో మొరాకో ప్లేయ‌ర్ ఇస్మాయిల్ గోల్ వేసి జ‌ట్టులో ఉత్సాహం నింపాడు. ఆ త‌ర్వాత 32వ నిమిషంలో వినీసియస్ జూనియర్ అద్భ‌తుమైన గోల్‌తో బ్రెజిల్‌ను గట్టెక్కించాడు. అత‌నికి ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్‌లో ఇది ప‌దో గోల్ కావ‌డం విశేషం. ఆ త‌ర్వాత రెండుజ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డినా గోల్స్‌ను వేయ‌లేక‌పోయాయి. అయితే, మ్యాచ్‌లో బ్రెజిల్ ఆధిప‌త్యం కొన‌సాగినా మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అయితే, ప్రపంచకప్ తొలి మ్యాచుల్లో బ్రెజిల్ విజ‌యం సాధిస్తూ రాగా.. ఈ సారి మాత్రం టైగా ముగిసింది. 1934 త‌ర్వాత నుంచి జ‌రుగుతున్న సాక‌ర్ ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ‌మ్యాచుల్లో ప్ర‌తీది గెలువ‌గా.. ఈసారి మాత్రం గెలువ‌లేక‌పోయింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయ‌ర్ జూనియ‌ర్ నెయ్‌మ‌ర్ లేక‌పోవ‌డం ఆ జ‌ట్టు బ‌లాన్ని దెబ్బ‌తీసింది.

తుర్కియేపై ఆస్ట్రేలియా సునాయాస విజ‌యం

గ్రూప్-డీలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2-0 తేడాతో టర్కియేపై సునాయాస విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించ‌గా.. తుర్కియే జ‌ట్టు పెద్ద‌గా ప్ర‌తిఘ‌టించ‌లేక‌పోయింది. తొలి అర్ధభాగంలో నెస్టోరి ఇరాంకుందా ఆస్ట్రేలియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. పాల్ ఓకాన్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న బాల్‌నునెస్టోరీ గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నెస్టోరీ రికార్డును నెల‌కొల్పాడు. ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్‌ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ లో-షాట్‌తో రెండో గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజ‌యాన్ని ఖ‌రారు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 22 ఏళ్ల యువ గోల్‌కీపర్ పాట్రిక్ బీచ్ ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. టర్కీ జట్టు చేసిన పలు ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను విజ‌య‌వంతంగా అడ్డుకొని క్లీన్ షీట్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇదిలా ఉండ‌గా.. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫిఫా ప్రపంచకప్ బరిలోకి తుర్కియే బ‌రిలోకి దిగ‌గా.. ఆ జ‌ట్టుకు తొలి మ్యాచ్‌లో నిరాశే ఎదురైంది.

ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చారిత్రక విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ వేదికపై విజయాన్ని అందుకున్న స్కాట్లాండ్ గ్రూప్-సీ తొలి మ్యాచ్‌లో హైటీపై 1-0 తేడాతో గెలిచి శుభారంభం చేసింది. జాన్ మెక్‌గిన్ చేసిన ఏకైక గోల్ జట్టుకు మూడు పాయింట్లు అందించింది. 1998 తర్వాత తొలిసారి పురుషుల ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అమెరికాలోని బోస్టన్ స్టేడియంలో వేలాది మంది స్కాటిష్ అభిమానుల మద్దతు మధ్య ఆడిన జట్టు 28వ నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లింది. జాన్ మెక్‌గిన్ కొట్టిన షాట్ ప్రత్యర్థి ఆటగాడిని తాకి దిశ మార్చుకుని గోల్‌పోస్ట్‌లోకి వెళ్లడంతో స్కాట్లాండ్‌కు కీలక ఆధిక్యం లభించింది. అయితే, హైతీ పలు అవ‌కాశాలు వ‌చ్చినా గోల్‌గా మార్చ‌లేక‌పోయింది. దీంతో స్కాట్లాండ్ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకుని విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ విజయంతో గ్రూప్-సీలో స్కాట్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. దాంతో ఆ జ‌ట్టుకు నాకౌట్ స్టేజ్‌కు అర్హత సాధించే అవకాశాలు పెరిగాయి. రాబోయే మ్యాచుల్లో మాత్రం ఆ జ‌ట్టుకు కీల‌క మ్యాచులు ఉన్నాయి. బ్రెజిల్, మొరాకో వంటి బ‌ల‌మైన జ‌ట్ల‌తో పోటీప‌డాల్సి ఉంది.

Advertisement
Advertisement