FIFA 2026 | అమెరికా గ్రాండ్ విక్టరీ.. పరాగ్వేపై గోల్స్ మోత
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026లో ఆతిథ్య అమెరికా శుభారంభం చేసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన గ్రూప్-డి తొలి మ్యాచ్‌లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం అమెరికా ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించగా, ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
- బలోగన్ డబుల్ గోల్ ధాటికి చిత్తయిన జట్టు
- వరల్డ్ కప్ హిస్టరీలో తొలిసారి నాలుగు గోల్స్
- కెనడా-బోస్సియా మ్యాచ్ డ్రా
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026లో ఆతిథ్య అమెరికా శుభారంభం చేసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన గ్రూప్-డి తొలి మ్యాచ్‌లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం అమెరికా ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించగా, ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికాకు పరాగ్వే ప్లేయర్ డామియన్ బొబాడిల్లా చేసిన పొరపాటు వరంగా మారింది. ప్రత్యర్థి దాడిని అడ్డుకునే ప్రయత్నంలో బంతిని పొరపాటున తన జట్టు గోల్‌పోస్ట్‌లోకే పంపడంతో అమెరికా ఖాతాలో తొలి గోల్ చేరింది. ఈ ఓన్ గోల్‌తో యూఎస్‌ఏ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత అమెరికా మరింత వేగాన్ని పెంచింది. 28వ నిమిషంలో ఫోలారిన్ బలోగన్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపినప్పటికీ, రిఫరీ డానీ మక్కెలీ ఆఫ్‌సైడ్ కారణంగా ఆ గోల్‌ను రద్దు చేశాడు. అయితే, బలోగన్ వెనక్కి తగ్గలేదు. మూడు నిమిషాలకే మరోసారి గోల్ వేశారు. దాంతో అమెరికా ఆధిక్యం 2-0కు పెరిగింది. తొలి అర్ధభాగం ముగియడానికి ముందు ఇచ్చిన అదనపు సమయంలోనూ అమెరికా జోరు కొనసాగింది. ఇంజ్యూరీ టైమ్‌లో బలోగన్ మరో గోల్ సాధించి డబుల్ గోల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో విరామ సమయానికి అమెరికా 3-0తో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో అర్ధభాగంలో పరాగ్వే పుంజుకునే ప్రయత్నం చేసింది.
73వ నిమిషంలో ప్రత్యామ్నాయ ఆటగాడు మౌరిసియో గోల్ సాధించి జట్టులో ఆశలు రేకెత్తించాడు. అయితే, అమెరికా కట్టుదిట్టంగా ఆడి పరాగ్వేకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ముగింపుకు కొద్దిసేపటి ముందు జియోవన్నీ రేనా అద్భుతమైన గోల్ వేశాడు. చివరకు 4-1 స్కోరుతో మ్యాచ్ ముగిసింది. ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అమెరికా నాలుగు గోల్స్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కెనడా-బోస్నియా మ్యాచ్ డ్రా..
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా టొరంటో వేదికగా జరిగిన గ్రూప్-బీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. కెనడా-బోస్నియా జట్ల మధ్య జరిగిన పోరు 1-1తో డ్రాగా ముగియడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ ఫలితంతో కెనడా తన ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి పాయింట్‌ను నమోదు చేసింది. మ్యాచ్ ఆరంభంలోనే బోస్నియా ఆధిక్యం సాధించింది. 21వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు జోవో లుకిచ్ కార్నర్ కిక్‌ను సమర్థంగా వినియోగించి గోల్ సాధించాడు. దీంతో బోస్నియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగంలో స్టార్ స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్‌కు గోల్ చేసే మంచి అవకాశం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

రెండో అర్ధభాగంలో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. 78వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన కెనడా ఆటగాడు సైల్ లారిన్ అద్భుతమైన గోల్ వేసి స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్ 1-1లోకి వచ్చి మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇక బోస్నియా వైపు నుంచి కెప్టెన్ సియాద్ కొలాసినాక్ కొట్టిన బంతి క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి రావడంతో జట్టుకు ఆధిక్యం సాధించే కీలక అవకాశం చేజారింది. చివరి వరకు ప్రయత్నాలు చేసినా ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఆతిథ్య దేశాల్లో ఒకటిగా ఉన్న కెనడాకు ఇది చారిత్రక మ్యాచ్ కాగా.. ప్రపంచకప్ వేదికపై తొలి పాయింట్‌ను నమోదు చేయడం కెనడా ఫుట్‌బాల్‌కు మైలురాయిగా నిలిచిపోయింది.
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం




