Erling Haaland’s Love Story | మైదానంలోనే కాదు.. ప్రేమలోనూ ఛాంపియనే..! హాలాండ్-ఇసాబెల్లే లవ్‌స్టోరీ తెలుసా..?
Erling Haaland's Love Story | ప్రపంచకప్-2026లో నార్వే జట్టు ఆశలన్నీ ఒకే ఆటగాడిపై నిలిచాయి. అతను ఎవరో కాదు ఎర్లింగ్ హాలాండ్. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ ముందు కనిపిస్తే గోల్ దాదాపు ఖాయమనే పేరున్న ఈ స్టార్ స్ట్రయికర్ ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో ఐదు గోల్స్‌తో తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Erling Haaland's Love Story | ప్రపంచకప్-2026లో నార్వే జట్టు ఆశలన్నీ ఒకే ఆటగాడిపై నిలిచాయి. అతను ఎవరో కాదు ఎర్లింగ్ హాలాండ్. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ ముందు కనిపిస్తే గోల్ దాదాపు ఖాయమనే పేరున్న ఈ స్టార్ స్ట్రయికర్ ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో ఐదు గోల్స్‌తో తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైదానంలో ప్రత్యర్థి డిఫెండర్లను ముప్పుతిప్పలు పెట్టే హాలాండ్ జీవితంలో మరో అందమైన కోణం ఉంది. అదే అతని ప్రేమకథ. సినిమా తరహా ప్రేమ కథు కాదు. చిన్ననాటి స్నేహం.. ఆ స్నేహంలో పుట్టిన నమ్మకం.. ఒక చిన్న మెసేజ్‌తో మొదలైన ప్రేమ.. కలిసి నడిచిన జీవితం.. చివరకు తల్లిదండ్రులుగా మారిన అందమైన ప్రయాణం. ఎర్లింగ్ హాలాండ్-ఇసాబెల్లే హాగ్‌సెంగ్ జోహాన్సెన్ ప్రేమకథ ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది.
ఒకే అకాడమీలో పరిచయం..
హాలాండ్, ఇసాబెల్లే ఇద్దరూ నార్వేలోని బ్రైన్ ఎఫ్‌కే (Bryne FK) ఫుట్‌బాల్ అకాడమీలోనే కలుసుకున్నారు. చిన్న వయసులోనే ఇద్దరూ ఒకే క్లబ్ యువజట్ల తరఫున ఫుట్‌బాల్ ఆడారు. అప్పట్లో వాళ్లు కేవలం మంచి స్నేహితులు. కాలం గడిచింది. హాలాండ్ కెరీర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ జర్మనీ దిగ్గజ క్లబ్ బోరుసియా డోర్ట్‌మండ్‌కు చేరాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారింది. తర్వాత హాలాండ్ మాంచెస్టర్ సిటీకి చేరిన సమయంలో ఇసాబెల్లే ఇంగ్లండ్‌కు వెళ్లి.. అతని జీవిత భాగస్వామిగా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది.
ప్రేమ విషయం చెప్పింది ఇసాబెల్లేనే..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న హాలాండ్‌ను ముందుగా సంప్రదించింది మాత్రం ఇసాబెల్లేనట. ఓ ఇంటర్వ్యూలో హాలాండ్ నవ్వుతూ చెప్పిన మాట ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ‘ముందుగా మెసేజ్ చేసింది నేనుకాదు. ఆమెనే. బ్రైన్ క్లబ్‌లో ఆమె కూడా ఫుట్‌బాల్ ఆడేది. నాపై ముందుగా ఆసక్తి చూపింది కూడా ఇసాబెల్లేనే’ అని హాలాండ్ వెల్లడించాడు. మైదానంలో గోల్స్‌తో సందడి చేసే హాలాండ్. ఇంట్లో మాత్రం వంట చేయడానికే ఎక్కువ ఇష్టపడతాడట. ‘వంట నేను చేస్తాను. ఇది చెప్పితే ఆమెకు కొంచెం సిగ్గుగా అనిపించొచ్చు. కానీ వీడియో గేమ్స్ ఆడడం ఆమెకు చాలా ఇష్టం’ అంటూ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ కలిసి మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ ఆడుతుంటారట. అందులో ఇళ్లు నిర్మించుకోవడం, కొత్త ప్రపంచాలను సృష్టించుకోవడం వాళ్లకు ఎంతో సరదా. ‘కొన్నిసార్లు బ్రైన్‌కు వెళ్లి కలిసి కబాబ్ తింటాం. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటాం’ అని హాలాండ్ చెప్పుకొచ్చాడు. మైన్‌క్రాఫ్ట్ తనకు బాగా ఇష్టమైన వీడియో గేమ్ అని, కబాబ్ అంటే ప్రాణమని గతంలోనూ చెప్పాడు. అయితే, ఫిట్‌నెస్ కారణంగా కబాబ్‌ను చాలా అరుదుగానే తింటానని తెలిపాడు.
ఫుట్‌బాల్‌తో పాటు ఫ్యాషన్‌లోనూ..

2004 జూలైలో నార్వేలోని బ్రైన్‌లో జన్మించిన ఇసాబెల్లే సైతం మంచి ఫుట్‌బాల్ ప్లేయరే. కేవలం 13 ఏళ్లకే బ్రైన్ ఎఫ్‌కే మహిళల జట్టులో అరంగేట్రం చేసింది. తన కెరీర్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 23 గోల్స్ సాధించింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టిన ఆమె సోషల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. కుటుంబం, ప్రయాణాలు, వెకేషన్లకు సంబంధించిన ఫొటోలను తరచూ పంచుకుంటూ ఉంటుంది. 2024 చివర్లో ఈ జంట జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. హాలాండ్-ఇసాబెల్లే తొలిసారి తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. అయితే, చిన్నారి పేరును మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. ఇసాబెల్లే గర్భవతి అని ప్రపంచానికి తెలియజేసిన తీరు కూడా ప్రత్యేకంగానే నిలిచింది. నార్వే తరఫున గోల్ చేసిన తర్వాత హాలాండ్ బంతిని తన టీషర్ట్‌లో పెట్టుకుని సంబరాలు చేసుకున్నాడు. ఆ ఒక్క సెలబ్రేషన్‌తో అభిమానులు అసలు విషయాన్ని అర్థం చేసుకున్నారు. అనంతరం అప్పటి మాంచెస్టర్ సిటీ కోచ్ పెప్ గార్డియోలా కూడా హాలాండ్ తండ్రయిన విషయాన్ని ధ్రువీకరించాడు.
రోమ్‌లో విహారం.. ఫ్యాషన్ షోలో పాల్గొని

తల్లిదండ్రులైన కొద్దిరోజులకే ఈ జంట ఇటలీలోని రోమ్ నగరానికి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ డోల్చే అండ్ గబ్బానా ఫ్యాషన్ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. రోమ్ గురించి హాలాండ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య అభిమానులను ఆకట్టుకుంది. ‘నేను చూసిన అత్యంత అందమైన నగరాల్లో రోమ్ ఒకటి. ఇక్కడి ఆహారం అద్భుతంగా ఉంటుంది. నాకు ఇటలీ అంటే చాలా ఇష్టం’ అని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు హాలాండ్ కోసం స్టేడియాలకు వస్తుంటారు. కానీ, గ్యాలరీలో అతని కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసే వ్యక్తి మాత్రం ఇసాబెల్లే. ఈ ప్రపంచకప్‌లో నార్వే ఆడిన ప్రతి మ్యాచ్‌కు ఆమె హాజరైంది. హాలాండ్ గోల్ చేసినా.. చేయకపోయినా మ్యాచ్ ముగిసిన తర్వాత అతని పక్కనే కనిపించింది. ఇద్దరూ కలిసి అభిమానులతో ఫొటోలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Colombia vs Ghana | కొలంబియాకు ప్రీక్వార్టర్స్ బెర్త్..
- ●Heavy Rains | నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..
- ●Revanth Reddy | బేగంపేట ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లలేకపోతున్న రేవంత్.. సీఎం కోసం ఎంసీహెచ్ఆర్డీలో హెలిప్యాడ్
- ●Woman Kills Husband | భర్తను చంపి బాత్రూమ్ కింద పాతిపెట్టింది..
- ●Argentina vs Cabo Verde | ముగిసిన కాబో వెర్డే పోరాటం
- ●Bhatti Vikramarka | అసలు రూట్లో కాకుండా డొంక మార్గంలో.. దారితప్పిన డిప్యూటీ సీఎం కాన్వాయ్..

Colombia vs Ghana | కొలంబియాకు ప్రీక్వార్టర్స్ బెర్త్..

Heavy Rains | నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

Revanth Reddy | బేగంపేట ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లలేకపోతున్న రేవంత్.. సీఎం కోసం ఎంసీహెచ్ఆర్డీలో హెలిప్యాడ్

Woman Kills Husband | భర్తను చంపి బాత్రూమ్ కింద పాతిపెట్టింది..





