త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | ఇంగ్లండ్‌కు రెండో విజ‌యం.. స్కాట్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు..

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

P

Sports | Published On Feb 14, 2026, 7.49 pm IST

T20 World Cup | ఇంగ్లండ్‌కు రెండో విజ‌యం.. స్కాట్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు..
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 49 ప‌రుగులు చేసి తృటిలో అర్ధ సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. మిచెల్ జోన్స్ (33), టామ్ బ్రూస్ (24), ఒలివ‌ర్ డేవిస‌న్ (20) మాత్ర‌మే రాణించ‌గా.. మిగ‌తా ఎవ‌రూ రెండంకెల స్కోర్ చేయ‌లేక‌పోయారు.

ఆదిల్ ర‌షీద్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జోఫ్రా ఆర్చ‌ర్, లియామ్ డాస‌న్ చెరో రెండు, జేమీ ఓవ‌ర్ట‌న్‌, సామ్ క‌ర్ర‌న్‌కు త‌లా ఒక వికెట్ ద‌క్కింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఫిల్ సాల్ట్ (2), జోస్ బ‌ట్ల‌ర్ (3) ప‌రుగుల‌కే వెనుదిరిగారు. ఆ త‌ర్వాత జాక్ బేథెల్ (33), టామ్ బాంటన్ (63*) రాణించారు. ఇద్ద‌రు మూడో వికెట్‌కు 66 ప‌రుగులు జోడించారు. చివ‌ర‌లో క‌ర్ర‌న్ (28) ప‌రుగులు చేయ‌గా.. విల్ జాక్స్ (16*)తో క‌లిసి బాంట‌న్ చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి ఇంగ్లండ్‌కు విజ‌యాన్ని అందించాడు. 18.2 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ 155 ప‌రుగులు చేసింది. ఈ విజ‌యంతో ఇంగ్లిష్ జ‌ట్టు గ్రూప్‌-సీలో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది.

 

Advertisement
Advertisement