త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | నాలుగు మ్యాచుల్లో నాలుగు విజ‌యాలు.. ! 22న సూప‌ర్ 8లో భార‌త్‌తో పోటీ..!

T20 World Cup | ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు యూఏఈపై ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి.. గ్రూప్ ద‌శ‌ను ముగించింది. రిజ‌ర్వ్ బెంచ్ బ‌లాన్ని ప‌రీక్షించేందుకు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తుదిజ‌ట్టులో నాలుగు మార్పులు చేసింది.

P

Sports | Published On Feb 18, 2026, 4.49 pm IST

T20 World Cup | నాలుగు మ్యాచుల్లో నాలుగు విజ‌యాలు.. ! 22న సూప‌ర్ 8లో భార‌త్‌తో పోటీ..!
Advertisement

T20 World Cup | ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు యూఏఈపై ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి.. గ్రూప్ ద‌శ‌ను ముగించింది. రిజ‌ర్వ్ బెంచ్ బ‌లాన్ని ప‌రీక్షించేందుకు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తుదిజ‌ట్టులో నాలుగు మార్పులు చేసింది. ఢిల్లీ అరుణ్ జైట్ల స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ జ‌ట్టు బ్యాటింగ్ తీసుకుంది. క‌గిసో ర‌బ‌డా బౌలింగ్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి మ‌హ‌హ్మ‌ద్ వ‌సీమ్ జ‌ట్టుకు శుభారంభం అందించాడు. అయితే, ఐదో ఓవ‌ర్‌లో జార్జ్ లిండేను సౌతాఫ్రికా బౌలింగ్‌కు దింప‌డంతో ఒక్క‌సారిగా మ్యాచ్ స్వ‌రూప‌మే మారిపోయింది.

క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప‌రుగులు రాకుండా అడ్డుకోవ‌డంతో పాటు వ‌సిమ్ వికెట్‌ను ప‌డ‌గొట్టాడు. ఆ త‌ర్వాత కార్బిన్ బోష్ ఆర్య‌న్ష్ శ‌ర్మ‌, సోహైబ్ ఖాన్ వికెట్లు కూల్చాడు. షార్ట్ బాల్ వ్యూహంతో యూఏఈ బ్యాటర్లను దక్షిణాఫ్రికా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. యూఏఈ బ్యాట్స్‌మెన్‌ల‌లో అలీషాన్ ష‌రాఫు ఒక్క‌డే 44 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌నికి ఇత‌ర బ్యాట్స్‌మెన్ నుంచి స‌హ‌కారం ల‌భించ‌లేదు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో యూఏఈ ఆరు వికెట్ల న‌ష్టానికి 122 ప‌రుగులు చేసింది. అయితే, కొద్దిసేపు వ‌ర్షం కుర‌వ‌డంతో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కాస్త ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. వ‌ర్షం త‌గ్గ‌డంతో ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. యూఏఈ స్పిన్ బౌలింగ్‌తో ఎదురుదాటి ప్రారంభించింది.

ఐడెన్ మార్క్రామ్ తొలి ఐదు బంతుల్లోనే 18 ప‌రుగులు చేసినా.. ఆరో బంతికి బౌల్డ్ అయ్యాడు. క్వింట‌న్ డికాక్ (14) థ‌ర్డ్ మ్యాన్ వ‌ద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ర‌యాన్ రికెల్ట‌న్ వేగంగా ఆడ‌గా (30), డేవాట్డ్ బ్రేవిస్ (36) వేగంగా ఆడేందుకు ప్ర‌య‌త్నించి పెవిలియ‌న్‌కు చేరారు. ఆ త‌ర్వాత ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌, జేస‌న్ స్మిత్ జాగ్ర‌త్త‌గా ఆడి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. ద‌క్షిణాఫ్రికా 13.2 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. మూడు వికెట్లు (3/12) తీసుకున్న కార్బిన్ బోష్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. దక్షిణాఫ్రికా గ్రూప్-1 సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడనుంది.

Advertisement
Advertisement