త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | ఆర్‌సీబీ వుమెన్స్ టీం.. హ్యాట్రిక్ విజ‌యంతో జోరు..

WPL 2026 | రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వుమెన్స్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జ‌యాంట్స్ వుమెన్ జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ టోర్నీలో ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ వ‌రుస‌గా మూడో విజ‌యాన్ని.. అంటే హ్యాట్రిక్‌ను న‌మోదు చేసింది.

S

Sports | Published On Jan 17, 2026, 7.23 am IST

WPL 2026 | ఆర్‌సీబీ వుమెన్స్ టీం.. హ్యాట్రిక్ విజ‌యంతో జోరు..
Advertisement

WPL 2026 | రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వుమెన్స్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జ‌యాంట్స్ వుమెన్ జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ టోర్నీలో ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ వ‌రుస‌గా మూడో విజ‌యాన్ని.. అంటే హ్యాట్రిక్‌ను న‌మోదు చేసింది. బ్యాటింగ్‌లో ప్లేయ‌ర్లు రిచా ఘోష్‌, రాధా యాద‌వ్ 105 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి జ‌ట్టు విజయంలో కీల‌క పాత్ర పోషించారు. అలాగే బౌల‌ర్ శ్రేయాంక పాటిల్ 5 వికెట్ల‌ను ప‌డ‌గొట్టగా, మ‌రో బౌల‌ర్ లారెన్ బెల్ 3 వికెట్లు తీసింది. దీంతో ఆర్‌సీబీ సునాయాసంగా విజ‌యం సాధించింది. గుజ‌రాత్‌పై 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూపీఎల్ 2026లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఆర్‌సీబీ మాత్ర‌మే ఓట‌మి పాలు కాని టీమ్‌గా ఉంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ జ‌యాంట్స్ జ‌ట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఆర్‌సీబీ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆర్‌సీబీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. తొలి 4 వికెట్ల‌ను ఆర్‌సీబీ చాలా త్వ‌ర‌గా కోల్పోయింది. దీంతో మ్యాచ్ చేజారిపోతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ రిచా ఘోష్‌, రాధా యాద‌వ్ నెల‌కొల్పిన భాగ‌స్వామ్యం కార‌ణంగా ఆర్‌సీబీ టీమ్ డిఫెండ‌బుల్ స్కోర్ సాధించ‌గ‌లిగింది. రాధా యాద‌వ్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 66 ప‌రుగులు చేయా, రిచా ఘోష్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 44 ప‌రుగులు చేసింది. ఇంకో ప్లేయ‌ర్ న‌దీన్ డి క్ల‌ర్క్ చివ‌ర్లో మెరుపులు మెరిపించింది. 12 బంతుల్లో ఆమె 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 26 ప‌రుగులు చేసింది. ఇక గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సోఫీ డివైన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, క‌శ్వీ గౌత‌మ్ 2 వికెట్లు తీసింది. అలాగే రేణుకా సింగ్‌, జార్జియా వేర‌మ్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌యాంట్స్ 18.5 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో భార‌తి ఫుల్మ‌లి (20 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) త‌ప్ప మిగిలిన ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు. చాలా మంది కేవ‌లం సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమితం అయ్యారు. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు ప‌డ‌గొట్టి గుజ‌రాత్ ప‌త‌నాన్ని శాసించ‌గా, లారెన్ బెల్ కూడా మ‌ళ్లీ ఈ మ్యాచ్‌లోనూ స‌త్తా చాటింది. ఆమె 3 వికెట్లు తీసింది. అరుంధతి రెడ్డి, న‌దీన్ డి క్ల‌ర్క్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో ఆర్‌సీబీ వుమెన్స్ జట్టు డ‌బ్ల్యూపీఎల్ 2026 పాయింట్ల ప‌ట్టికలో అగ్ర స్థానంలో ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement