త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Sooryavanshi | ఈసారి ఎలాగైనా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ట్రోఫీ సాధిస్తా: వైభ‌వ్ సూర్య‌వంశీ

Vaibhav Sooryavanshi | కేవలం 14 ఏళ్ల వయసులో అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన యువ బ్యాట‌ర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు టైటిల్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ 2025లో తన అద్భుత ప్రదర్శనతో టోర్నమెంట్‌ను కుదిపేసిన సూర్యవంశీ, టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

S

Sports | Published On Mar 16, 2026, 10.09 am IST

Vaibhav Sooryavanshi | ఈసారి ఎలాగైనా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ట్రోఫీ సాధిస్తా: వైభ‌వ్ సూర్య‌వంశీ
Advertisement

Vaibhav Sooryavanshi | కేవలం 14 ఏళ్ల వయసులో అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన యువ బ్యాట‌ర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు టైటిల్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ 2025లో తన అద్భుత ప్రదర్శనతో టోర్నమెంట్‌ను కుదిపేసిన సూర్యవంశీ, టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో హరారేలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లో 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు రికార్డు స్థాయిలో ఆరో టైటిల్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతని దృష్టి మొత్తం ఐపీఎల్ 2026 పైనే ఉంది.

ఐపీఎల్ ట్రోఫీ లిఫ్ట్ చేయ‌డ‌మే ల‌క్ష్యం..

బీసీసీఐ నమన్ అవార్డ్స్ కార్యక్రమం సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన సూర్యవంశీ.. ఈ ఐపీఎల్ సీజన్‌లో త‌మ‌ జట్టుకు ట్రోఫీ సాధించ‌డ‌మే త‌న‌ ప్రధాన లక్ష్యమ‌ని తెలిపాడు. అది చాలా ముఖ్యమైన విషయమ‌ని, తాను బాగా ఆడితే అది మొత్తం జట్టుకు ఉపయోగపడుతుంద‌ని అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో త‌న‌ వంతు పాత్ర పోషించి ఫ్రాంచైజీకి ట్రోఫీ అందించడమే త‌న‌ లక్ష్యమ‌ని తెలిపాడు. తన దూకుడైన బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన సూర్యవంశీ ఈ అవార్డుల కార్యక్రమంలో తనతో కలిసి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన సహచర ఆటగాళ్లను కూడా కలుసుకున్నాడు. ఇలా అంద‌రం మ‌ళ్లీ క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని, ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్‌కు ట్రోఫీ సాధించామ‌ని, ఈ అవార్డుల కార్య‌క్ర‌మం ద్వారా మ‌ళ్లీ తోటి ప్లేయ‌ర్లు, కోచ్‌ల‌ను క‌ల‌వ‌డం సంతోషంగా ఉంద‌ని వైభ‌వ్ అన్నాడు.

ఐపీఎల్‌తో పెద్ద మార్పు..

కాగా 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభ‌వ్‌ను రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఒప్పందం పొందిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బీహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ స్కౌట్లు తనపై ఎలా దృష్టి పెట్టారో కూడా గుర్తు చేసుకున్నాడు. తాను దేశీయ క్రికెట్ ఆడ‌డం ప్రారంభించాక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కౌట్లు త‌న ఆట‌ను గ‌మ‌నిస్తూ వ‌చ్చార‌ని వైభ‌వ్ తెలిపాడు. త‌న దేశీయ మ్యాచ్‌ల‌తోపాటు అండర్ 19 మ్యాచ్‌ల‌ను వారు చాలా కాలం నుంచి ప‌రిశీలించార‌ని తెలిపాడు. త‌న ట్ర‌య‌ల్స్ కూడా వారితో చాలా బాగా జ‌రిగాయ‌ని, అందుక‌నే తాను రాజస్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో చేర‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం క‌లిగింద‌ని తెలిపాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ఉండ‌డం త‌న జీవితంలో పెద్ద మార్పును తీసుకువ‌చ్చింద‌ని చెప్పాడు.

ద్రావిడ్ నుంచి అనేక విష‌యాలు నేర్చుకున్నా..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఉండ‌డం త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని, వారి త‌ర‌ఫున ఆడుతూ త‌న జీవితంలో కూడా తాను చాలా అభివృద్ధి చెందాన‌ని వైభ‌వ్ తెలిపాడు. జ‌ట్టులోని సీనియ‌ర్ ప్లేయ‌ర్లు, కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి తాను చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాన‌ని వెల్ల‌డించాడు. ఏ యువ ఆట‌గాడికైనా మొద‌టి ఐపీఎల్ క్యాంప్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని, త‌న‌కు కూడా అలాగే అనిపించింద‌ని, ఆ స‌మ‌యంలో రాహుల్ ద్రావిడ్ అక్క‌డ ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న నుంచి అనేక విష‌యాల‌ను నేర్చుకునే అవ‌కాశం ల‌భించింద‌న్నాడు. జ‌ట్టులో చాలా మంది సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఉన్నార‌ని, మొద‌టి క్యాంప్‌లోనే కాకుండా త‌న తొలి ఐపీఎల్ సీజ‌న్‌లో కూడా వారి నుంచి త‌న‌కు మంచి అనుభ‌వం, పాఠాలు ల‌భించాయ‌ని సూర్యవంశీ తెలిపాడు.

Advertisement
Advertisement