త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Sooryavanshi | ఆర్సీబీపై వైభ‌వ్ జోరు.. ప‌దేండ్ల రికార్డును తుడిపేసిన రాజ‌స్థాన్ ఓపెన‌ర్లు

Vaibhav Sooryavanshi | ఐపీఎల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) జోరు కొన‌సాగుతున్న‌ది. 15 ఏండ్ల కుర్రాడి విధ్వంస‌క బ్యాటింగ్ ముందు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మ‌హామ‌హులైన బౌల‌ర్లు తేలిపోతున్నారు. మొన్న ముంబైపై బుమ్రాను ఒక ఆటాడుకున్న వైభ‌వ్‌.. నిన్ని ఆర్సీబీ పేస‌ర్లు జోష్ హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్‌కు చుక్క‌లు చూపించాడు.

G

Sports | Published On Apr 11, 2026, 7.25 am IST

Vaibhav Sooryavanshi | ఆర్సీబీపై వైభ‌వ్ జోరు.. ప‌దేండ్ల రికార్డును తుడిపేసిన రాజ‌స్థాన్ ఓపెన‌ర్లు
Advertisement

Vaibhav Sooryavanshi | త్రినేత్ర‌.న్యూస్‌: ఐపీఎల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) జోరు కొన‌సాగుతున్న‌ది. 15 ఏండ్ల కుర్రాడి విధ్వంస‌క బ్యాటింగ్ ముందు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మ‌హామ‌హులైన బౌల‌ర్లు తేలిపోతున్నారు. మొన్న ముంబైపై బుమ్రాను ఒక ఆటాడుకున్న వైభ‌వ్‌.. నిన్ని ఆర్సీబీ పేస‌ర్లు జోష్ హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్‌కు చుక్క‌లు చూపించాడు.

గువాహ‌టి వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు.. 201 ప‌రుగులు చేసింది. భారీ విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్.. చిచ్చ‌ర పిడుగు ఓపెన‌ర్‌ వైభ‌వ్ వీర‌విహారంతో విజ‌యం సాధించింది. 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో చేల‌రేగిన సూర్య‌వంశీ 78 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఇన్నింగ్ నాలుగో ఓవ‌ర్ వేసిన హాజిల్‌వుడ్ (Hazlewood) బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 18 రన్స్‌ సాధించాడు. ఐదో ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్‌నూ (Bhuvneshwar Kumar) వ‌ద‌ల్లేదు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 16 ర‌న్స్ వ‌చ్చాయి. అంత‌కుముందు అభినందన్ సింగ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

ర్యాపిడ్ ఇన్నింగ్స్‌తో కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ 353.33గా నమోదు కావడం విశేషం. కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరుతో ఉంది. అత‌డు 13 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (14 బంతులు) రెండో స్థానంలో ఉండ‌గా, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 15 బంతుల్లో అర్ధశతకం సాధించి యూసుఫ్ పఠాన్ సరసన చేరాడు. ప్రస్తుత సీజన్‌లో వైభవ్ ఇలా 15 బంతుల్లోనే అర్థసెంచరీ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇంతకుముందు చెన్నై జట్టుపై కూడా విరుచుకుపడ్డాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ 4 మ్యాచుల్లో 266.67 స్ట్రైక్ రేటుతో 200 ప‌రుగులు చేశాడు. త‌న తోటి ఓపెన‌ర్‌ను వెన‌క్కి నెట్టి అత్య‌ధిక ప‌రుగుల ఆరెంజ్ క్యాప్ రేసులో మొద‌టి స్థానానికి చేరాడు.

ప‌దేండ్ల రికార్డు..

ఇదే మ్యాచ్‌లో మ‌రో రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 248 బంతుల్లోనే 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ జోడీగా య‌శ‌స్వీ జైస్వాల్‌, వైభ‌వ్ సూర్య‌వంశి గుర్తింపు పొందారు. గతంలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ 309 బంతుల్లో 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు. గ‌త ప‌దేండ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును వైభవ్, యశస్వి జోడీ కేవలం 248 బంతుల్లోనే అధిగమించింది. అయితే ఓవరాల్‌గా చూస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ అత్యంత వేగవంతమైన 500 పరుగుల రికార్డులో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతున్న‌ది.

 

Advertisement
Advertisement