T20 World Cup 2026 | పాక్ ఓటమి.. ఆనందంతో డ్యాన్సులు చేసిన బలోచిస్తాన్ యువత..
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) భారత్ చేతిలో పాకిస్తాన్ (India-Pakistan) ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పాక్ ఓడిపోవడంతో బలోచిస్తాన్ (Balochistan) యువత సంబరాలు చేసుకుంది.
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) దాయాది పాకిస్తాన్‌తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ (India-Pakistan) జయకేతనం ఎగుర వేసింది. దాయాది దేశాన్ని భారత్ 61 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో టీమ్ ఇండియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గెలుపుపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు హెరెత్తాయి. యువత నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక భారత్ గెలుపును మన దేశంతో పాటు ఆప్ఘనిస్థాన్ ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి టీమ్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. అలాగే తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న పాక్ ఆధీనంలోని బలోచిస్తాన్ (Balochistan)లోనూ యువత వేడుకలు చేసుకుంది. పాక్ ఓడిపోయిందన్న ఆనందంతో రోడ్లపై డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఓటమిని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని ఏకంగా టీవీనే పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత్ కేవలం 114 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లు సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్‌కు 61 పరుగుల భారీ విజయం దక్కింది. ఈ గెలుపుతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లలో భారత్-పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డు 8-1కి చేరింది. ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం మరింత బలపడింది.
https://x.com/NewsAlgebraIND/status/2023128438971023731
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



