Mohammed Shami | షమీకి అన్ని దారులు మూసుకుపోయినట్లే.. ఇక జట్టులోకి రావడం కష్టమే..?
Mohammed Shami | న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ జట్టుతో ఆడాల్సిన టీమిండియా ప్లేయర్లను సెలెక్టర్లు, కోచ్ తాజాగా ఎంపిక చేశారు. అయితే ఈ భారత క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి మాత్రం మరోసారి వారు మొండిచేయే చూపించారు.
Mohammed Shami | న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ జట్టుతో ఆడాల్సిన టీమిండియా ప్లేయర్లను సెలెక్టర్లు, కోచ్ తాజాగా ఎంపిక చేశారు. అయితే ఈ భారత క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి మాత్రం మరోసారి వారు మొండిచేయే చూపించారు. దేశవాళీ టోర్నీల్లో వికెట్లను తీస్తూ సత్తా చాటుతున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం షమీని ఎంపిక చేయక పోవడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న కారణంగా బీసీసీఐ తాజాగా టీమిండియా సభ్యులను ప్రకటించింది. అయితే అందులో పెద్దగా మార్పులు ఏమీ కనిపించలేదు. అందరూ షమీకి చాన్స్ ఇస్తారని భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం యంగ్ ప్లేయర్ల వైపే మొగ్గు చూపారు. అయితే ఎంత ప్రదర్శన చేసినప్పటికీ జట్టులోకి షమీని తీసుకోకపోవడంతో ఇక షమీకి అన్ని దారులు మూసుకుపోయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంకా 2 ఏళ్ల పాటు అంటే..?
షమీ వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు కాగా మరో 2 ఏళ్లలో అతను 37 ఏళ్లకు చేరుకుంటాడు. అయితే ఆ వయస్సులో సాధారణంగా అగ్ర శ్రేణి జట్లకు చెందిన క్రీడాకారులు క్రికెట్ వరల్డ్ కప్ ఆడరు. అందువల్ల షమీని వయస్సును దృష్టిలో ఉంచుకుని అతను వచ్చే వరల్డ్ కప్‌కు ఆడకపోవచ్చునని భావించి అతన్ని ఎంపిక చేయడం లేదని స్పష్టమవుతోంది. సాధారణంగా ఒక ప్లేయర్ దేశవాళీ టోర్నీల్లో రాణిస్తే కచ్చితంగా ఏదో ఒక సమయంలో సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేస్తారు. టీ20 వరల్డ్ కప్‌కు గాను ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు కదా. అలాగే సెలెక్టర్లు ప్లేయర్లను ఎంపిక చేస్తారు. కానీ షమీ విషయానికి వస్తే అతని వయస్సే అతనికి అడ్డంకిగా మారిందని స్పష్టమవుతోంది. వచ్చే వరల్డ్ కప్ వరకు షమీ వయస్సు పెరుగుతుంది కనుక అతను ఆ టోర్నీలో ఆడే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదని సెలెక్టర్లు భావించి ఉంటారని, అందుకనే అతన్ని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదని స్పష్టమవుతోంది. అయితే దీనిపై షమీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అసలు ఎలా స్పందిస్తాడు అన్న వివరాలు వేచి చూస్తే తెలుస్తాయి.
రోహిత్, విరాట్‌ల భవిష్యత్తు ఏంటి..?
అయితే షమీ మాత్రమే కాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భవిష్యత్తు కూడా దాదాపుగా ఇలాగే ప్రశ్నార్థకంగా మారింది. వారు ఇటీవల ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రాణించారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటారు. కానీ సీనియర్ ప్లేయర్లు కనుక వారిని ప్రస్తుతానికి పక్కన పెట్టేందుకు సెలెక్టర్లు ధైర్యం చేయలేదు. కానీ వారు గనక వన్డేలలో విఫలం అయితే వారికి కూడా షమీ పరిస్థితే ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు గాను శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రావడం విశేషం. కానీ అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయి కనుక మ్యాచ్‌కు ముందు వరకు అతను ఆడుతాడా లేదా అన్న విషయంలో స్పష్టత కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూజిలాండ్‌తో ఆడనున్న భారత వన్డే జట్టు ఇదే..
శుబమాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైశ్వాల్.
టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ జట్టులో చోటుకు గాను హార్దిక్ పాండ్యా, జస్‌ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతిని ఇచ్చారు. ఇక మ్యాచ్‌కు ముందు శ్రేయాస్ అయ్యర్ ఫిట్ నెస్‌ను, ఆరోగ్య స్థితిని అంచనా వేసి అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలా, వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ సిరీస్‌లోనూ గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ హర్షిత్ రానాకు చోటు కల్పించారు. కాగా న్యూజిలాండ్‌తో భారత్ సొంత గడ్డపై ఈ నెల 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తేదీన తొలి వన్డే వడోదరలో జరగనుండగా రెండో వన్డేను 14వ తేదీన రాజ్ కోట్‌లో నిర్వహిస్తారు. 3వ వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరుగుతుంది. ఆ తరువాత 5 టీ20ల సిరీస్‌ను నిర్వహిస్తారు. అయితే వన్డే జట్టులో షమీకి చోటు దక్కకపోవడంపై అతను తీవ్ర నిరాశ, అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



