త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh | బంగ్లాదేశ్‌కు మ‌తి భ్ర‌మించిందా..? ఐపీఎల్ నుంచి తీసేస్తే ఐసీసీకి ఎలా చెబుతారు..?

Bangladesh | బంగ్లాదేశ్‌తో నెల‌కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ కార‌ణంగా ఆ దేశ క్రికెట‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను ఐపీఎల్ నుంచి తొల‌గించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ నిర్ణ‌యాన్ని బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం జీర్ణించుకోలేక‌పోతోంది. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఐసీసీని సంప్ర‌దించింది.

S

Sports | Published On Jan 4, 2026, 11.52 am IST

Bangladesh | బంగ్లాదేశ్‌కు మ‌తి భ్ర‌మించిందా..? ఐపీఎల్ నుంచి తీసేస్తే ఐసీసీకి ఎలా చెబుతారు..?
Advertisement

Bangladesh | బంగ్లాదేశ్‌తో నెల‌కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ కార‌ణంగా ఆ దేశ క్రికెట‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను ఐపీఎల్ నుంచి తొల‌గించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ నిర్ణ‌యాన్ని బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం జీర్ణించుకోలేక‌పోతోంది. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఐసీసీని సంప్ర‌దించింది. అయితే ఒక లీగ్ నుంచి ప్లేయ‌ర్‌ను త‌ప్పిస్తే ఐసీసీ ఏం చేస్తుంద‌ని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు, ఆ దేశ ప్ర‌భుత్వానికి మ‌తి భ్రమించింద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ముస్తాఫిజుర్ ఏమైనా బంగ్లా జ‌ట్టుతో వ‌చ్చి ఆడాల‌ని చూస్తే భార‌త్ వ‌ద్ద‌ని చెబుతుందా.. ఒక దేశానికి చెందిన దేశవాళీ లీగ్‌కు, ఐసీసీకి ఏం సంబంధం ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. బంగ్లా వైఖరి విస్మ‌యానికి గురి చేస్తుంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఐసీసీకి ఫిర్యాదు చేస్తార‌ట‌..?

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)కు చెందిన బౌల‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను రిలీజ్ చేయాల‌ని బీసీసీఐ ఆదేశాలు ఇవ్వ‌గా కేకేఆర్ అమ‌లు చేసింది. అయితే దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. మ‌రోవైపు బంగ్లాదేశ్ మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వానికి చెందిన క్రీడా మంత్రిత్వ శాఖ స‌ల‌హాదారు ఆసిఫ్ న‌జ్‌రుల్ ఈ విష‌యంపై ఆగ్ర‌మం వ్య‌క్తం చేశారు. బంగ్లా ప్లేయ‌ర్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్పించి త‌మ జ‌ట్టును, ప్లేయ‌ర్ల‌ను, దేశాన్ని భార‌త్ అవ‌మానించింద‌ని ఆరోపించారు. ఇలాంటి అవ‌మానాల‌ను స‌హించేది లేద‌న్నారు. ఐపీఎల్‌కు చెందిన అన్ని మ్యాచ్‌ల‌ను బంగ్లాదేశ్‌లో ప్ర‌సారం కాకుండా నిషేధం విధిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు మీడియా సంస్థ‌ల‌కు, దేశ ప్ర‌భుత్వానికి లేఖ రాసిన‌ట్లు చెప్పారు. అలాగే ఈ విష‌యాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు ఆసిఫ్‌తోపాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలియ‌జేసింది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే భార‌త్‌లో బంగ్లా ప్లేయ‌ర్ల‌కు భ‌ద్ర‌త ఉంటుంద‌ని తాము అనుకోవ‌డం లేద‌ని, క‌నుక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను తాము భార‌త్‌లో ఆడ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ వేదిక‌ల‌ను శ్రీ‌లంక‌కు మార్చాల‌ని ఐసీసీని కోర‌నున్న‌ట్లు తెలిపారు.

ఇది మ‌తి భ్రమించిన చ‌ర్యే..?

అయితే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడ‌తారా, లేదా అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఐపీఎల్ గురించి వారు ఐసీసీకి ఫిర్యాదు చేస్తామ‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని ప‌లువురు మాజీలు, విశ్లేష‌కులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ అనేది భార‌త్‌కు చెందిన ఒక దేశ‌వాళీ లీగ్ అని, అది ఐసీసీ కింద‌కు రాద‌ని, ఐపీఎల్‌ను ఐసీసీ నియంత్రించ‌లేద‌నే విష‌యం తెలియ‌క బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అలాంటి వ్యాఖ్య‌ల‌ను చేస్తుంద‌ని, వారికి బ‌హుశా మ‌తి భ్ర‌మించి ఉంటుంద‌ని అంటున్నారు. ఫ్యాన్స్ సైతం ఇదే విషయంలో బంగ్లాదేశ్‌ను ట్రోల్ చేస్తుండ‌డం విశేషం. ఇక దీనిపై బీజేపీ నాయ‌కురాలు న‌వ‌నీత్ రానా మాట్లాడుతూ బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయ‌ర్ల‌ను అస‌లు భార‌త్‌లో ఆడనివ్వ‌కూడ‌ద‌ని, భార‌త్‌కు చెందిన లీగ్ మ్యాచ్‌ల‌లోనూ వారు ఆడ‌కుండా చర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. దీంతో వివాదం మ‌రింత రాజుకున్న‌ట్లు అయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement