Abhishek Sharma | అభిషేక్ శర్మకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాక్.. 25 శాతం ఫైన్, 1 డీమెరిట్ పాయింట్..
Abhishek Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బాగానే చేసినా పేలవమైన బౌలింగ్‌తో నిరాశపరిచింది. అయినప్పటికీ తమ రెండో మ్యాచ్‌లో మాత్రం పుంజుకుని ఘన విజయం సాధించింది.
Abhishek Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బాగానే చేసినా పేలవమైన బౌలింగ్‌తో నిరాశపరిచింది. అయినప్పటికీ తమ రెండో మ్యాచ్‌లో మాత్రం పుంజుకుని ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఓ సమయంలో ప్రవర్తించిన తీరుకు గాను అతనికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించడంతోపాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 21 బంతుల్లోనే 48 పరుగులు చేసి అద్భుతమైన ఓపెనింగ్‌ను ఇచ్చినా అతను నిబంధనలను ఉల్లంఘించాడంటూ ఐపీఎల్ పాలక మండలి శిక్ష విధించింది.
అసభ్య పదజాలం ఉపయోగించిన అభిషేక్..?
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే అభిషేక్ శర్మకు క్రమశిక్షణ ఉల్లంఘన కింద జరిమానా విధించారు. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ అనంతరం అభిషేక్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చడంతోపాటు అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. మ్యాచ్ సమయంలో అభిషేక్ ప్రవర్తనపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అసలు ఏం జరిగింది అన్న వివరాలను మాత్రం అధికారులు ప్రకటనలో వెల్లడించలేదు. కానీ మ్యాచ్ సమయంలో అతను అసభ్య పదజాలం ఉపయోగించినట్లు తెలిసింది. దీంతో ఆర్టికల్ 2.3 లెవల్-1 ఉల్లంఘన కింద అతను తప్పు ఒప్పుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభిషేక్ శర్మ తప్పును ఒప్పుకుని మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని అంగీకరించాడని తెలిపారు. లెవల్-1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని తెలిపారు.
కాగా లెవల్-1 ఉల్లంఘన తక్కువ తీవ్రత కలిగించే విషయం అయినప్పటికీ అభిషేక్ శర్మ మళ్లీ ఇలాంటి తప్పులనే చేస్తే అతనికి మరింత కఠిన శిక్ష విధించడంతోపాటు అతన్ని ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల పాటు సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ బ్యాటర్లు..
ఇక మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టుకు చక్కని శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు వీరు 82 పరుగులను జోడించారు. అప్పటికే పవర్ ప్లే పూర్తయింది. ఇది జట్టు భారీ స్కోరుకు పునాది వేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ (35 బంతుల్లో 52 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), నితీష్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును భారీ స్కోరు దిశగా మళ్లించారు. కోల్‌కతా బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని 4 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరాకు 2 వికెట్లు దక్కాయి. కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ చెరొక వికెట్ తీశారు.
కోల్‌కతా కొంప ముంచిన రనౌట్లు..
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆరంభంలో దూకుడుగానే ఆడినా రెండు రనౌట్లు ఆ జట్టు కొంప ముంచాయి. జట్టు కీలక సమయాల్లో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్లను కోల్పోయింది. అంగ్‌క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 52 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడు మీద ఉన్న సమయంలో రనౌట్ అవగా, మరో ప్లేయర్ కామెరాన్ గ్రీన్ కూడా 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. ఇవి జట్టును ఒత్తిడిలోకి నెట్టాయి. తరువాత బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. దీంతో కోల్‌కతా 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనడ్కట్ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. హర్ష్ దూబేకు 1 వికెట్ దక్కింది. జట్టుకు కీలక సమయంలో పరుగులను జోడించడంతోపాటు వికెట్లను కూడా తీసిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

IPL Play-off Scenario | చెన్నై ప్లేఆఫ్ ఆశలు సజీవం.. కానీ గుజరాత్, హైదరాబాద్‌ను దాటాల్సిందే..!
మే 16, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



