INDW Vs SLW | మహిళల టీ20 మ్యాచ్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం..
INDW Vs SLW | విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మహిళల టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా తరువాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.
INDW Vs SLW | విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మహిళల టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా తరువాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన అనంతరం మళ్లీ భారత్ ఈ సిరీస్‌తో మైదానంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే శుభారంభం అందుకుంది. ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగు పడాల్సి ఉన్నా బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటారు. శ్రీలంక వికెట్లను తీస్తూ ఆ ప్లేయర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో వారు నిర్ణీత ఓవర్లలో తక్కువ స్కోరు చేశారు. ఈ క్రమంలో శ్రీలంక నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. శ్రీలంకపై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టు ప్లేయర్లలో ఓపెనర్ విష్మి గుణరత్నె 43 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 39 పరుగులు చేయగా, మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణిలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 122 పరుగులు చేసింది. భారత జట్టు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీలో ఆకట్టుకుంది. 44 బంతుల్లో 10 ఫోర్లతో జెమీమా 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, ఓపెనర్ స్మృతి మంధాన 25 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కావ్య కవింది, ఇనోకా రణవీరలకు చెరొక వికెట్ దక్కింది. మొత్తం 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో విజయంతో భారత్ సిరీస్‌లో ఆధిక్యంలోకి చేరగా, ఈ నెల 23వ తేదీన ఇరు జట్ల మధ్య మళ్లీ ఇదే వేదికలో రెండో టీ20 మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vaibhav Sooryavanshi | చిచ్చర పిడుగు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ వేతనం ఎంతంటే..?
ఏప్రిల్ 13, 2026

Yuzvendra Chahal | యజ్వేంద్ర చాహల్‌పై నెటిజన్ల ఆగ్రహం.. దుమారం రేపుతున్న వీడియో..
ఏప్రిల్ 12, 2026

IPL 2026 Ads | ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు తగ్గిన ప్రకటనలు.. 3 శాతం మేర క్షీణత..
ఏప్రిల్ 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



